రామమందిరముండేదనడానికి ఆధారాలువిస్తృతమైన తవ్వకాల తరువాత పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ స్థానంలోనే బాబరీ కట్టడ కట్టారని కూడా తేల్చింది.


సాహిత్య సాక్ష్యాలు

-     సంస్కృత సాహిత్యము

-     ముస్లిం రచయితల రచనలు

-     విదేశీ రచయితల రచనలు మరియు నివేదికలు

మహర్షి వాల్మీకి కాలమునుండి ప్రస్తుత కాలము వరకు అనేక మహాకావ్యాలు, పురాణాలు, ఉపనిషత్తులు, కవితలు మరియు మతపరమైన గ్రంధాలలోను  అయోధ్య రాముని జన్మస్థానమని అనేక సందర్భాలలో  తెలియచేస్తున్నవి. అయోధ్య మహాత్మ్యంలో శ్రీ రామునికి సంబంధించి అనేక పవిత్ర స్థలాల గురించి వివరమైన వర్ణన కూడా ఉన్నది. ఇందులోనే  శ్రీ రామజన్మభూమి మందిరం ఉన్న ప్రదేశం గురించి మందిర ప్రాముఖ్యత గురించి వివరణ ఉంది.

కావ్యాలు : వాల్మీకి రామాయణము, మహా భారతంలో రామ ఉపాఖ్యానము (వన పర్వము), యోగ వాశిష్ట్యం, ఆధ్యాత్మ రామాయణము, రఘువంశము మొ||

కవితలు : రమాగీత-గోవిందము, గీత రాఘవ, రామ విలాసము, రామ అష్టకము మొ||

నాటకాలు : ప్రతిమాభిషేకము, ఉత్తర రామచరిత్ర, హనుమానాటకము, ప్రసన్న రాఘవ, రామాభ్యుదయము మొ||

ఆఖ్యాన : బృహత్‌ కథామంజరి, చంపు రామాయణము, కథ సరిత్సరం మొ||

పురాణాలు : విష్ణు, బ్రహ్మాండ, వాయు, కూర్మ, పద్మ, స్కంద, నారద మొ||

ఉపనిషత్తులు : రామోత్తర తపనీయ, రామ రహస్యము మొ||

మరికొన్ని గ్రంధాలు : జైమినియా, అశ్వమేధము, హనుమత్‌ విజయము, హనుమత్‌ సంహితము, బృహత్‌ కౌశల్‌ ఖండ్‌ మొ||

ముస్లిం రచయితల పుస్తకాలు

1. సాహిఫా-ఈ-చాహల్‌-నాసా-ఇహ్‌-బహద్దూర్‌ షాహీ :

బహద్దూర్‌ షా కుమారుడైన అలంగిర్‌ కుమార్తె వ్రాసిన పుస్తకం (పదిహేడవ శతాబ్ది అంతం-పద్దెనిమిదవ శతాబ్ది ఆరంభం) ఇది.

2. హదిక-ఈ-షాదా : మీర్జా జాన్‌

3. ఫాసన-ఈ-ఇబ్రాత్‌ : మీర్జా రజబ్‌ అలీ బైగ్‌ సరూర్‌

4. గంగష్ట్‌-ఈ-హాలాత్‌-అయోధ్య-అవధ్‌ : మౌలావి అబ్దుల్‌ కరీం (బాబరీ మసీదు ఇమామ్‌)

5. తారీఖ్‌-ఈ-అవధ్‌ : అల్లామా మహమ్మద్‌ నజముల్‌ ఘనీ ఖాన్‌ రాంపురీ

దేవాలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారని నిర్ధారణ చేసే, ముస్లిం రచయితలు వ్రాసిన మరిన్ని పుస్తకాలు:

-     జియా-ఈ-అక్తర్‌ : హాజి మహమ్మద్‌ హస్సన్‌ 1878

-    కేసర్‌-ఉల్‌-తవారిక్‌ (తవారిక్‌-ఈ-అవధ్‌) వాల్యూం 2 : కమాలుద్దీన్‌ హైదర్‌ హుస్సేన్‌ అల్‌ హుస్సేన్‌ అల్‌ మాషహాది

-     అర్సార్‌-ఈ-హాకీకత్‌ : లక్ష్మీ నారాయణ్‌ సర్దార్‌ కానోన్గో అసిస్టెంట్‌ ఆఫ్‌ మున్షి మౌలవి హషామి

-     హిందుస్తాన్‌ ఇస్లామీ ఆహద్‌ : మౌలానా హకీమ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ హాయ్‌ - 1972

విదేశీ చరిత్రకారుల సమగ్ర నివేదిక

1.    భారతదేశపు చారిత్రక భౌగోళిక నివేదిక జోసెఫ్‌ టేఫ్లాంతర్‌ -1785

2.     అవధ్‌ మండల అధికారపత్ర కారులు-1877

3.     ఫైజాబాద్‌ అంగీకార పత్రం-1880

4.     న్యాయస్థానపు ఆదేశం :  న్యాయమూర్తి-కల్నల్‌  ఎఫ్‌ ఇ ఏ ఛైమియర్‌ సివిల్‌ అప్పీల్‌ నెంబర్‌ 27-1885

5.     భారతీయ పురాతన వస్తు నివేదిక-ఎ ఫ్యురర్‌ 1891

6.     బరబాంకీ జిల్లా అధికార పత్రం- హెచ్‌ ఆర్‌ నెవిల్‌ 1902

7. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా15 వ ఎడిషన్‌ - వాల్యూమ్‌1 : 1978

ఆల్‌ ఇండియా బాబ్రీ మస్జిద్‌ యాక్షన్‌ కమిటీ దాఖలు చేసిన పత్రాలు నిరాధారమైనందున సాక్ష్యం పనికిరావు. అవి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారి అభిప్రాయాలేకానీ ఎటువంటి ఆధారాలు కావు.