ఏ అపచారాన్ని సహించలేదు (స్ఫూర్తి)



స్వామి వివేకానంద విద్యార్థిగా ఉన్న రోజులలో జరిగిన సంఘటన. ఒక క్రైస్తవ మత ప్రచారకుడు నడివీధిలో మన ధర్మాన్ని, దేవీ దేవతలను హేళన చేస్తూ 'నేను మీ దేవతా విగ్రహాన్ని  కొడితే మీ దేవుడేంచేస్తాడు?'' అని అపహస్యం చేశాడు. ఆ దారిన వెళ్తున్న నరేంద్రుడు ''నేను మీ దేవుడి విగ్రహాన్ని కొడితే అప్పుడేం చేస్తాడు?'' అని ప్రశ్నించాడు. 


''నీవు చనిపోయాక నిన్ను ఘోర నరకాగ్నిలో పడవేస్తాడు'' అన్నాడు ఆ మత ప్రచారకుడు. ''నీవు చనిపోయాక మా దేవుడూ నిన్ను నరకాగ్నిలో తోస్తాడు'' అని బదులిచ్చాడు నరేంద్రుడు.  మన మతం, ధర్మం దేవీదేవతలపట్ల ఏ అపచారాన్ని సహించలేదు.

''మీ విదేశీయులు మా మతానికి, దేశానికి చేసిన అపకారానికి హిందూ మహా సముద్రంలోని బురదనంతా తెచ్చి మీ ముఖాన కొట్టినా ప్రాయశ్చిత్తం జరగదు'' అని నిర్భయంగా విశ్వమత మహాసభలో విమర్శించాడు.