అన్ని బస్తిల్లో శాఖలు ఉంటే హిందూ సమాజం అజేయమవుతుంది


''హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం లేదు. అలాగే శబరిమల ఆలయాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ సమాజాన్ని సమైక్యపరచి అజేయం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శాఖ పద్ధతిని ప్రారంభిం చింది. చాల సరళమైన, సులభమైన ఈ పద్ధతి ద్వారా హిందూ సంఘటన మహా కార్యం నెరవేరుతుంది'' అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. జనవరి 5, 2019 చెన్నైలో జరిగిన మహానగర బస్తి సంగమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నాడు పారిశుద్ధ్య కార్మికుడు... నేడు నగర మేయర్...రాజేష్‌ కాలియా..  తాను పొట్టకూటి కోసం ఏ నగర వీధుల వెంట చెత్త ఏరుకుని జీవనం సాగించారొ ఇప్పుడు అదే నగరాన్ని మేయర్‌ హోదాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ధర్మరక్షణ ద్వారా సమరసతను సాధించిన సంత్‌ రవిదాస్‌

(ఫిబ్రవరి 19 సంత్‌ రవిదాస్‌ జయంతి)
సంత్‌ రవిదాసు చర్మకార వృత్తి అవలంబి స్తూనే గొప్ప సాధకుడయ్యాడు. ''భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డుగోడలెందుకు?''అని ఆయన ప్రశ్నించారు. గుణకర్మలవల్లనే ఉత్తము డవుడని చాటిచెప్పిన మహాత్ముడు సంత్‌ రవిదాస్‌. సామాన్యజీవితంలో అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రవిదాస్‌ గొప్ప జ్ఞాని, గొప్ప కవి. స్వామి రామా నంద్‌, కబీర్‌, ఇతర సాధుసంతులతో ధర్మరక్షణకు యాత్రలు చేశాడు.

అన్నీ సాధ్యమే...(స్ఫూర్తి)రామకృష్ణపరమహంసను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు - ''సంసారపు పనులు చేసుకుంటూ భగవంతుడి ఆరాధన సాధ్యమేనా?'' దానికి సమాధానంగా రామకృష్ణులు ''ఎందుకు సాధ్యం కాదు? గ్రామీణ స్త్రీ వడ్లను దంచడం చూశారుకదా. ఆమె ఒకచేతితో రోకలి పట్టుకుని దంచుతూనే ఉంటుంది. మరోవైపు పిల్లవాడిని సముదా యిస్తుంటుంది. 

సత్యమేవ జయతే..... (హితవచనం)


వర్తమాన కాలంలో అనేక మంది విద్వాంసులు అనేక సంప్రదాయాలలో కనిపిస్తారు. వాళ్ళు పక్షపాతం వదిలి సత్యాన్ని గ్రహించాలి. పరస్పరం విరుద్ధంగా ఉన్న విషయాలు స్వార్థ పరులకు ప్రియమైనవిగా, సామాన్యు లకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి.  

అమరవాణి


తపసోః పరమ్‌ నాస్తి

తపస్య విందతే మహత్‌

తపస్య క్షీయతే పాపం

మోదతే సహ దైవతైః    (మత్స్య పురాణం)

ప్రముఖులు మాట


శబరిమలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బాధాకరంగా ఉంది. అటువంటి సంఘటనలు దురదృష్టకరం. ఆలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టు గొమ్మలు. కాబట్టి వాటిని కాపాడాలి. ప్రతి గుడికి ఒక సంప్రదాయం ఉంటుంది. దానిని గౌరవించాలి. 

- మాతా అమృతానందమయి, ఆధ్యాత్మికవేత్త

ప్రముఖ సామాజిక కార్యకర్త నానాజీ దేశముఖ్‌కు భారతరత్నసరస్వతి శిశుమందిరాల వ్యవస్థాపకులు, గ్రామీణాభివృద్ధి సాధకులు శ్రీ నానాజీ దేశముఖ్‌కి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన నానాజీ సంఘ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ముస్లిం దేశాల్లోనే ముస్లింలకు భద్రత లేదు


తన జాతీయవాద ధోరణిని ప్రదర్శించడంలో ఏమాత్రం సంకోంచించని ఇస్లామిక్‌ పండితుడు సయ్యద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంటారు. తన బంధువు, నటుడు అయిన నసిరుద్దీన్‌ షా 'అసహిష్ణుత' గురించి మళ్ళీ చర్చ ప్రారంభించాలని ప్రయత్నించినప్పుడు రిజ్వాన్‌ అహ్మద్‌ స్పష్టంగా దానిని వ్యతిరేకించారు. భారత దేశాన్ని గురించి అపోహలు, విమర్శలు ప్రచారం చేయడానికి సర్వత్ర పోటీ సాగుతున్న సమయంలో రిజ్వాన్‌ మాత్రం హిందూ - ముస్లిం సంబంధాల గురించి సానుకూలమైన దక్పధాన్నే వ్యక్తం చేశారు -

అఖండ సాంస్కృతిక సమ్మేళనం కుంభమేళా (విశ్లేషణ)


గంగా, గురువు, గోవు, గాయత్రీ, గీత అనే ఐదు భారతీయ సాంస్కృతిక చిహ్నాలు, శ్రద్ధ కేంద్రాలు. ప్రస్తుతం జనవరి 15 - మార్చ్‌ 4 వరకు 55 రోజుల పాటు ఉత్తర ప్రదేశ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థానం ప్రయగ్‌ రాజ్‌లో గంగా పుష్కరాలు జరుగుతున్నాయి. 12 సంవత్సలకు ఒకసారి జరిగే వీటినే కుంభమేళాగా పిలుస్తాము. మూడు నదుల సంగమం ''ప్రయాగ''ను భూమికి కేంద్ర బిందువు అని, బ్రహ్మ ఇక్కడే తపస్సు చేసి విశ్వసృష్టి చేసాడని పురాణాల్లో ఉన్నది. ఈ సంగమ ప్రాంతాన్ని నిత్యం దేవిదేవతల సంరిక్షి స్తుంటారని మత్స్య పురాణంలో మార్కేండయ మహర్షి తెలిపాడు. ఈ పవిత్ర ప్రాంతంలో నెలపాటు ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వలన మోక్షం లభిస్తుంది అని ప్రజల ప్రగాడ నమ్మకం.

మహా ఉపవాస దీక్ష


శబరిమల పవిత్రత కాపాడాలనే నినాదంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉపవాస దీక్ష శిబిరాలు ''మహా ఉపవాస దీక్ష''  జరిగింది. శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది ఉపవాస దీక్ష చేశారు.

రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి?
అయోధ్యలో వివాదాస్పదమైనదిగా చెపుతున్న స్థలంపై రామ్‌ లాలాకే పూర్తి హక్కులు ఉంటాయని, అది రామజన్మభూమి అని అలహాబాదు హైకోర్ట్‌ స్పష్టం చేసింది. న్యాయస్థానం వక్ఫ్‌ బోర్డ్‌ వాదనను తిరస్కరించింది.

బాలికల వికాసం కోసం సేవా భారతి 'రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌'


సేవాభారతి ఆధ్వర్యంలోని కిశోరీ వికాస్‌ కేంద్ర ఏర్పాటు చేసిన 'రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌' (బాలికల వికాసం కోసం పరుగు) కార్యక్రమంగా జనవరి 20 ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. బాలికల వికాసమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ పరుగు కార్యక్రమంలో 8 వేల మందికి పైగా క్రీడాకారులు, సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల విభాగాల్లో సాగిన ఈ పరుగులో తెలంగాణ వ్యాప్తంగా 50 ఐటీ కంపనీలకు చెందిన ఉద్యోగు లతో పాటు 400 మంది వివిధ సైనిక విభాగాలను చెందిన జవాన్లు కూడా పాల్గొన్నారు.

భారత రక్షణరంగంలో మహిళలు.. (నారీ లోకం...)


మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేశాలలో ఎప్పటినుంచో భారత దేశం ముందంజ లోనే ఉంది... పురాణాల్లో నరకాసురున్ని వధించిన సత్యభామ నుంచి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటీషు ముష్కరులనెదిరించిన ఝాన్సీ రాణి వరకూ మన దేశంలో యుద్ద క్షేత్రంలో కదం తొక్కిన వీర నారీ మణులకు లెక్కే లేదు. ఆడది అంటే వంటగదికే పరిమితం అనే నానుడినుంచి మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించేలా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సజ్జలు (గృహ వైద్యం)


-      100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్‌  66 గ్రా, ప్రొటీన్స్‌ 10 గ్రా, ఫాట్స్‌ 4.5 గ్రా, కాల్షియం 50 గ్రా, ఫాస్ఫరస్‌ 350 మి.గ్రా, ఐరన్‌ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా, పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్‌ A -2205 I .U , B1 - 329 మి.గ్రా, నియాసిన్‌ 3.2 మి.గ్రా ఆక్సాలిక్‌ ఆసిడ్‌ 14.5 మి.గ్రా ఉన్నాయి .

స్వాభిమానంతో స్వధర్మానికి.. క్రైస్తవం నుండి 96 మంది గిరిజనుల పునరాగమనం


సమానత్వం పేరిట క్రైస్తవ మిషనరీలు చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి క్రైస్తవంలోకి వెళ్లిన 96 మంది గిరిజనులు, చివరకు తాము వంచనకు గురైనట్టు గ్రహించి, తిరిగి సగర్వంగా స్వధర్మంలోకి  తిరిగివచ్చారు. త్రిపుర రాష్ట్రం ఉనకోటి జిల్లాలో జరిగిన ఘటన ఇది. సుమారు 9 సంవత్సరాల క్రితం తమ గ్రామంలోకి ప్రవేశించిన కొందరు క్రైస్తవ మిషనరీలు మాయమాటలతో మభ్యపెట్టి, తమ ధర్మానికి తమని దూరం చేశారు. లేనిపోని ఆశలు కల్పించి, మోసపూరితంగా క్రైస్తవ మతం లోకి మార్చివేశారు. వారి మాయలో పడిన ఆ అమాయకపు గిరిజనులు ఆ సమయంలో తమ సంస్కృతికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న నష్టాన్ని ఊహించలేకపోయారు. తాము వదిలివేసిన మాతృధర్మంపై ద్వేషం పెంచుకున్నారు.

మదర్సాలు మూయకపోతే ఐఎస్‌ సమర్ధకులు పెరుగుతారు - షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వీ


దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్‌కు సానుభూతి పరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో మదర్సా లను వెంటనే మూయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ''ఈ మతపాఠశాలలు ముస్లిములను సామాజిక, ఆధునిక విద్య నుంచి దూరం చేస్తున్నాయి. దేవబంద్‌, వహాబీ మదర్సాలు ఇస్లాం గురించిన తప్పుడు సిద్ధాంతాలు, సూత్రాలను పిల్లల మనస్సుల్లో నింపుతున్నాయి. వారిని జిహాద్‌ కోసం తయారుచేస్తున్నాయి. పిడి వాదాన్ని, వేర్పాటువాదాన్ని పిల్లల్లో కలిగిస్తున్నాయి'' అని రిజ్వీ ఆరోపించారు.