సజ్జలు (గృహ వైద్యం)


-      100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్‌  66 గ్రా, ప్రొటీన్స్‌ 10 గ్రా, ఫాట్స్‌ 4.5 గ్రా, కాల్షియం 50 గ్రా, ఫాస్ఫరస్‌ 350 మి.గ్రా, ఐరన్‌ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా, పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్‌ A -2205 I .U , B1 - 329 మి.గ్రా, నియాసిన్‌ 3.2 మి.గ్రా ఆక్సాలిక్‌ ఆసిడ్‌ 14.5 మి.గ్రా ఉన్నాయి .

-      100 గ్రా సజ్జలు  జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.

-      సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్‌ మొదలుకొని హెలైన్‌ వంటి ఎమైనో ఆసిడ్స్‌ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్‌, విటమిన్‌ A, దీలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.

-      సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం పూట వాడుచున్న శరీరముకు మంచి బలం కలుగుతుంది.

-      నిద్ర పట్టనివారు, మొలల వ్యాధితో బాధపడే వారు, నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకొనుచున్న మంచి ఫలితం కనిపిస్తుంది.

-      సజ్జలను అధికంగా తీసుకుంటే యూరిక్‌ ఆసిడ్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మితంగా తీసికోవాలి.

-      మధుమేహ వ్యాధిగ్రస్థులు, మలబద్దకం, క్షయ, గనేరియా వంటి వ్యాధులు ఉన్నవారు సజ్జలు తినకూడదు.