రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి?
అయోధ్యలో వివాదాస్పదమైనదిగా చెపుతున్న స్థలంపై రామ్‌ లాలాకే పూర్తి హక్కులు ఉంటాయని, అది రామజన్మభూమి అని అలహాబాదు హైకోర్ట్‌ స్పష్టం చేసింది. న్యాయస్థానం వక్ఫ్‌ బోర్డ్‌ వాదనను తిరస్కరించింది.

అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌ లోని ముగ్గురు న్యాయమూర్తులు

1. జస్టిస్‌ ధరమ్‌ వీర్‌ శర్మ

2. జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌

3. జస్టిస్‌ సిబాఘతుల్లా ఖాన్‌

తీర్పు ఇచ్చిన తేది: 2010 సెప్టెంబరు 30

తీర్పు వివరాలు

మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు.

ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు ఫిర్యాదుదారులైన నిర్మోహి అఖాడా, ముస్లింలు, మరియు రాంలాలాకు కేటాయిస్తూ తీర్పు చెప్పారు. సున్ని వక్ఫ్‌ బోర్డ్‌ దావాను న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్‌ ధరమ్‌ వీర్‌ శర్మ తీర్పులోని ముఖ్య విషయాలు

వివాదాస్పద స్థలంగా పేర్కొంటున్న స్థలం ప్రభు శ్రీరామచంద్రుడి జన్మస్థలం. జన్మస్థలం ఒక చట్టబద్ధమైన వ్యక్తి మరియు ఒక దేవుడికి సంబంధించినది. ప్రభు శ్రీరామచంద్రుడు బాలుడి రూపంలో పూజలందుకుంటున్న ప్రదేశాన్ని పవిత్ర జన్మస్థలంగా భావిస్తున్నారు. పవిత్రతతో కూడిన దైవీ  భావన ఎల్లవేళలా అన్నిచోట్లా ఎవరిద్వారా నైనా, ఆయా వ్యక్తుల భావాలకనుగుణంగా ఏ ఆకారంలోనైనా లేదా ఆకార రహితంగాను  జాగతం కావచ్చు.

వివాదాస్పద కట్టడాన్ని ఆ ప్రదేశంలో అంతకు ముందే ఉన్న పాత కట్టడాన్ని ధ్వంసం చేసి కట్టారు. భారత పురాతత్వ శాఖ ఆ పాత కట్టడం బహత్తర మైన హిందూ ధార్మిక కట్టడం అనే విషయాన్ని నిర్ధారించింది.

జస్టిస్‌ సిబాఘతుల్లా ఖాన్‌ తీర్పులోని ముఖ్య అంశాలు

వివాదిత స్థలం, అందులోని నిర్మాణం బాబర్‌ కుగానీ లేదా అక్కడ మసీదు కట్టాలని ఆదేశించిన వారికిగానీ చెందినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా మసీదు అనబడే వివాదాస్పద కట్టడం ఎవరి  ఆజ్ఞల ద్వారా కట్టబడ లేదు  అని నిరూపించబడినది.

జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ తీర్పు సారాంశం లో కొన్ని కీలక అంశాలు

అయోధ్యలో వివాదాస్పద కట్టడం మధ్య గుమ్మటం/కప్పు క్రింద ఉన్న ప్రదేశం కోట్లాది హిందువుల విశ్వాసం, నమ్మకం ప్రకారం మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్ర మూర్తి జన్మస్థలం.

ఈ వాజ్యంలో శ్రీ రాముడిదే గెలుపు.. ఎందుకంటే?

ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ రామచంద్ర విగ్రహం, ఒక సజీవ దైవ స్వరూపము. చట్ట ప్రకారం తన వాదన తానే వినిపించగలదు. కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీ రాముడు బాల రాముడు. చట్టం ప్రకారం మైనర్‌ కాబట్టి న్యాయ పోరాటాలలో తన వాదన వినిపించటానికి సంరక్షకుడు(గార్డియన్‌)అవసరం. అలహాబాద్‌ న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి స్వర్గీయ దేవకీ నందన్‌ అగర్వాల్‌ శ్రీ రామచంద్రుని స్నేహితుడిగా ఆయన తరఫున న్యాయస్థానంలో రామజన్మభూమి కోసం వ్యాజ్యం వేశారు.

ఇదే కాకుండా ఆ ప్రదేశం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్రుడి జన్మస్థానం. ఆ మొత్తం ప్రదేశమే ఒక పుణ్య తీర్థం. అతి పూజనీయం. కనుక ఆ ప్రదేశం న్యాయపోరాటానికి పూర్తిగా తగినది. ఈ హక్కుని వేల  సంవత్సరాల నుంచి హిందూ మత గ్రంధాలు విపులంగా ప్రస్తావించాయి. అలాగే మన న్యాయ స్థానాలు కూడా ఈ విషయాన్ని అంగీకరించాయి.

న్యాయస్థానం సున్నీ వక్ఫ్‌ బోర్డు వాజ్యం ఎందుకు  తిరస్కరించింది ?

ఇస్లామిక్‌ ధార్మిక గ్రంధాలు, షరియా చట్టాల ప్రకారం ఇతరుల ఆస్తి (విగ్రహం వున్న ప్రదేశంలో కానీ, గర్భ గుడి, లేదా ఇతరుల దేవాలయ అవశేషాలు /లేదా దేవాలయ స్థలం) వక్ఫ్‌ ఆస్థిగా పరిగణించటానికి అనుమతి లేదు.

అదేవిధంగా ఇస్లాం మతంలో మసీదుకు ప్రాముఖ్యత లేదని, అల్లాహ్‌ కి నమాజ్‌ ఎక్కడైనా చెయ్యవచ్చని, బహిరంగ ప్రదేశంలో కూడా నమాజ్‌ చెయ్యటానికి ఇస్లాం అనుమతి ఇస్తుందని సుప్రీం కోర్ట్‌ ఇటీవల స్పష్టం చేసింది. ఈ కారణాల దష్ట్యా వక్ఫ్‌ బోర్డ్‌ వేసిన వాజ్యాన్ని గౌరవనీయ న్యాయ స్థానం కొట్టి వేసింది.