ప్రముఖులు మాట


శబరిమలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బాధాకరంగా ఉంది. అటువంటి సంఘటనలు దురదృష్టకరం. ఆలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు పట్టు గొమ్మలు. కాబట్టి వాటిని కాపాడాలి. ప్రతి గుడికి ఒక సంప్రదాయం ఉంటుంది. దానిని గౌరవించాలి. 

- మాతా అమృతానందమయి, ఆధ్యాత్మికవేత్తఅయోధ్య రామమందిరం కేసుపై సాధ్యమైనంత త్వరగా తీర్పు ఇవ్వాలి. విచారణలో అనవసర జాప్యం కారణంగా ప్రజల్లో సహనం తగ్గుతోంది.

- యోగి ఆదిత్యనాధ్‌,  ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిఅమెరికాపట్ల నా నిబద్ధతపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను హిందువును కాబట్టి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. హిందూయేతర నాయకులను ఇలా ప్రశ్నించ గలరా? ఒబామా, ట్రంప్‌, హిల్లరీ కలిసినట్లే నేను కూడా మోదీని కలిశాను. ఇందుకు నాపై విమర్శలు సరికాదు.

- తులసీ గబార్డ్‌, అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు