సత్యమేవ జయతే..... (హితవచనం)


వర్తమాన కాలంలో అనేక మంది విద్వాంసులు అనేక సంప్రదాయాలలో కనిపిస్తారు. వాళ్ళు పక్షపాతం వదిలి సత్యాన్ని గ్రహించాలి. పరస్పరం విరుద్ధంగా ఉన్న విషయాలు స్వార్థ పరులకు ప్రియమైనవిగా, సామాన్యు లకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి.  


సజ్జనులు అందరి హితం కోరి పని చేస్తున్నప్పుడు స్వార్థపరులు దానికి విరోధులుగా మారతారు. వారి మార్గంలో అనేక విఘ్నాలు, బాధలు కలిగిస్తారు. సత్యమేవ జయతే నానృతం, సత్యేన ప న్థా వితతో దేవయభః - ఎప్పుడూ సత్యానికే విజయం, అసత్యానికి పరాభవం జరుగుతాయి. సత్యంవల్లనే విద్యాం సుల మార్గం సుగమమవు తుంది. ఈ దృఢ నిశ్చయాన్ని అవలంబించి విద్యాంసులు పరోపకార కార్యంలో ఉదాసీనులు కాకుందురుగాక.