ముస్లిం దేశాల్లోనే ముస్లింలకు భద్రత లేదు


తన జాతీయవాద ధోరణిని ప్రదర్శించడంలో ఏమాత్రం సంకోంచించని ఇస్లామిక్‌ పండితుడు సయ్యద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంటారు. తన బంధువు, నటుడు అయిన నసిరుద్దీన్‌ షా 'అసహిష్ణుత' గురించి మళ్ళీ చర్చ ప్రారంభించాలని ప్రయత్నించినప్పుడు రిజ్వాన్‌ అహ్మద్‌ స్పష్టంగా దానిని వ్యతిరేకించారు. భారత దేశాన్ని గురించి అపోహలు, విమర్శలు ప్రచారం చేయడానికి సర్వత్ర పోటీ సాగుతున్న సమయంలో రిజ్వాన్‌ మాత్రం హిందూ - ముస్లిం సంబంధాల గురించి సానుకూలమైన దక్పధాన్నే వ్యక్తం చేశారు -


ప్ర. అసహిష్ణుత గురించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నసిరుద్దీన్‌ షా వ్యాఖ్యలతో 'అసహిష్ణుత బృందం' మళ్ళీ బలం పుంజుకున్నారు. కొందరైతే ఏకంగా హిందూస్థాన్‌ కంటే పాకిస్థాన్‌ సురక్షితమైనదంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?

జ. ఇతర మతాలతో కలిసి శాంతియుతంగా జీవించలేని ముస్లింల ధోరణే భారత్‌లో అసహిష్ణు తకు మూల కారణం. 1947 రక్తసిక్త దేశ విభజన తరువాత భారత్‌ సెక్యులర్‌ దేశంగా ఉండాలని ఇక్కడ అందరూ నాయకులు కోరుకున్నారు. హిందు వులు కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. అందువల్లనే ఇక్కడ అద్భుతమైన మతసామరస్యం వెల్లివిరిసింది. కానీ అందుకు ప్రతిఫలంగా ముస్లింలు హిందువులకు ఏమిచ్చారు? ఏమీలేదు. హిందువులు ఆధునిక చట్టాలు చేసుకున్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ రాజకీయ ధోరణి పుణ్యమాని ముస్లిములకు ప్రత్యేక సదుపాయాలు, హక్కులు లభించాయి. అప్పటినుంచి ముస్లింలు షాబాను కేసు కావచ్చును, కాశ్మీరీ పండిట్‌లను వారి స్వస్థలం నుంచే తరిమివేయడం కావచ్చును, బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ చొరబాటుదారులు కావచ్చును, ఇలా అనేక సందర్భాల్లో  తమ క్రియాశీల ప్రతిస్పందనను చూపడంలో విఫలమయ్యారు. దీనితో 'సెక్యులరిజం పేరిట తమకు అన్యాయం జరుగుతోందని' హిందువులలో అసంతప్తి ప్రారంభమయింది. అది క్రమంగా పెరిగి హిందువులు తమ అభిప్రాయాన్ని కచ్చితంగా, గట్టిగా వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దానినే ఇప్పుడు అందరూ 'అసహిష్ణుత' అంటు న్నారు. ఇది బూటకపు సెక్యులరిస్ట్‌లు, పిడివాద ముస్లింలు ప్రచారం చేస్తున్న ధోరణే కానీ మరొకటి కాదు.

ప్ర. గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారమవు తున్న అసహిష్ణుత, అభద్రతల గురించి మీరే మంటారు?
జ. మైనారిటీల పేరుతో ముస్లిములు సంతుష్టీ కరణకు, తాయిలాలకు బాగా అలవాటుపడ్డారు. ఈ తాయిలాల గురించి, సంతుష్టీకరణ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళు 'అసహిష్ణుత పెరిగిపోతోంది' అంటూ గగ్గోలు పెడతారు.

ప్ర. చాలామంది ముస్లిములు చెపుతున్నట్లుగా భారత్‌లో ముస్లిములకు భద్రత లేదని ముస్లిమైన మీరు కూడా అనుకుంటున్నారా?

జ. బెన్నహల్‌ సొరంగం దాటి కాశ్మీర్‌ లోయలోకి వెళ్ళినప్పుడే ముస్లింలకు 'భద్రత' లేమి కనిపిస్తోంది. ముస్లిములు అధికసంఖ్యాకులుగా కలిగిన ముస్లిం దేశాల్లోనే వారికి భద్రత లేదు. దురదష్టవశాత్తు ఏ దేశాల్లోనైతే ముస్లిములు మైనారిటీలో అక్కడ వాళ్ళు తమ 'మతపరమైన ఆధిక్యత' పేరుతో వేర్పాటువాదానికి పాల్పడి, 'ఇతరులు' తమకు అన్యాయం చేస్తున్నారని రాగాలు తీస్తారు.

ప్ర. మీరు సామాజిక మాధ్యమాలలో మీరు ఇస్లాంలోని నకారాత్మక అంశాలను లేదా ఏదైనా చట్టాన్ని విమర్శించినప్పుడు అనేకమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడటంపట్ల ఏమంటారు?

జ. ఇలా కొందరు అసలు ఇస్లాం సారాంశాన్ని మరచిపోయి మాట్లాడుతుంటారు. అరేబియా వంటి అజ్ఞాన భూమిలో ఇస్లాం పుట్టింది. అక్కడి ప్రజలను సంస్కరించడానికి వచ్చింది. 1400 ఏళ్లక్రితం ఇస్లాం అత్యంత సంస్కరణ రూపంలో వచ్చిందని వీళ్ళు అనుకూకుంటున్నారు. కాబట్టి ఇస్లాంలో ఇక సంస్కరణకు తావులేదని, అలా సంస్కరిస్తే అది ఇస్లామే కాకుండా పోతుందన్నది వీరి అభిప్రాయం. ఇందులో భావప్రకటన స్వాతంత్య్రానికి అవకాశం లేదని వారనుకుంటారు. జిహాద్‌ గురించిన 12,13 శతాబ్దాలనాటి అర్ధాన్నే ఇప్పటికీ అన్వయించాలను కుంటున్నారు. ముస్లింలను ఎవరైనా ప్రశ్నించినా, విమర్శించినా వారిని కాఫిర్‌లని ముద్రవేస్తున్నారు.

ప్ర. తలాక్‌ బిల్లు అత్యవసరమని ఎన్డీయే ప్రభుత్వం అంటూంటే విపక్షాలు, కొన్ని ముస్లిం సంస్థలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మీరేమంటారు?

జ. తలాక్‌ పద్దతి ఇస్లాం మతంలో భాగం కాదు. అది కేవలం కొందరు ఆచరించడం వల్ల ప్రాచుర్యం పొందింది. అందుకనే అనేక ముస్లిం దేశాల్లో కూడా దానిని నిషేధించారు. 90శాతం ముస్లిం మహిళలు, చాలామంది పురుషులు ఈ తలాక్‌ పద్దతి సరైనది కాదని భావిస్తారు. కానీ నరేంద్ర మోదీపట్ల ముస్లింలలో వ్యతిరేకత ఎంతబలంగా పాటుకుపోయిందంటే తలాక్‌ పద్దతిపై మోదీ అనుసరిస్తున్న వైఖరిని వాళ్ళు ప్రశంసించలేకపోతున్నారు. బిల్లును సమర్ధిస్తే తాము మోడీని సమర్ధించినట్లవుతుందని చాలామంది మౌనంవహిస్తున్నారు.

మోదీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని, వారిని జైళ్ళలో కుక్కుతారని ఆరోపిస్తున్నవారు. పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తలక్‌ పద్దతి భారత్‌లో ఇక ముందు ఉండదని, షరియా ప్రకారం అది చెల్లుబాటుకాదని ప్రకటించాలి. కానీ వాళ్ళు అలా చేయరు ఎందుకంటే మోదీ విఫలమయ్యారని చూపడమే వారికి ముఖ్యం.

ప్ర.  స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్ళకు పైగా గడుస్తున్నా ముస్లింలు ఇప్పటికీ వెనుకబడిన వర్గంగానే ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటారు?

జ. ముస్లింల వెనుకబాటుతనానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, ముస్లిం ఉలేమా, మరొకటి విద్యావంతులైన ముస్లింలు. విద్యా వంతులైన ముస్లింలు కూడా మతాధికారులతో కలిసిపోయి సంస్కరణలకు మద్దతుయివ్వడంలేదు. ఈ విద్యావంతులైన, మేధావులైన ముస్లింలు ఇతరులను ప్రధాన స్రవంతిలో కలిసే విధంగా చేసిఉంటే అప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ ఈ మేధావులు, మతాధికారులు కలిసే పనిచేస్తున్నారు. అందుకనే నా ప్రకారం ముస్లిం సంస్కరణ అంటే ఒక చేతిలో ఖురాన్‌, మరో చేతిలో ల్యాప్‌టాప్‌ పట్టుకోవడంకాదని నేను అంటూంటాను.

రాజకీయపార్టీలన్నీ ముస్లింలను ఉపయో గించుకుని 'రైట్‌ వింగ్‌'ను విమర్శిస్తున్నాయి. భారత్‌ లో ముస్లింలకు, ఇస్లాం కు భద్రత లేదని పదేపదే చెప్పడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా ముస్లింలలో భయాన్ని, ఆందోళనను కలిగించడానికి ప్రయత్నించాయితప్ప వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవాలని చూడలేదు.

ప్ర. అయోధ్యలో రామ మందిరం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ. రామ మందిరం గురించి నా తోటి ముస్లిం సోదరులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. 'రాముడు ఎక్కడ పుట్టాడు' అంటూ అనవసరమైన వాదోప వాదాలకు దిగకూడదని వారిని కోరుతున్నాను. బాబ్రీ కట్టడం కింద మందిరం ఉండేదని పురావస్తు సాక్ష్యాధారాలు ఎప్పుడైతే లభ్యమయ్యాయో అప్పుడే ముస్లింలు బేషరతుగా ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించి ఉండాల్సింది.