ప్రముఖులు మాట


భారత వాయుసేన మెరుపు దాడులు జరిపి బాలాకోట్‌ ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేయడం పుల్వమా అమర జవాన్లకు నివాళే. భారత్‌ శక్తి సంపన్నం కావాలని వీర సావర్కర్‌ ఆకాంక్షిం చారు. శక్తివంతులం కాకుంటే మనమాట ఎవరు వినరు.             
- డా. మోహన్‌ భాగవత్‌,  ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ఎవరైనా ఉగ్రదాడులకు పాల్పడితే భారత్‌ చేతులు ముడుచుకుని కూర్చోదు. వారికి సరైన రీతిలో సమాధానం చెప్పి తీరుతుంది. మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని గ్రహించిన భారత్‌ ముందుగానే ఉగ్రవాదులపై దాడి చేసి మట్టుపెట్టింది. అంతర్జాతీయ సమాజం అంతా ఇప్పుడు భారత్‌తోనే ఉంది.

- హర్షవర్ధన్‌ ష్రింగ్లా, అమెరికాలో భారత రాయబారి


ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గురించి రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు తమకు అను కూలంగా రాకపోతే అవి సరిగా పనిచేయడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా ఈవిఎంలను వినియోగి స్తున్న విషయాన్ని పార్టీలు గుర్తుంచుకోవాలి.

- సునీల్‌ అరోరా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి