భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్‌ కుట్ర


ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్‌లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. వెంటనే వీరంతా ఆ వర్గంపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగి పోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. ప్రభుత్వం ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలుసుకుని, ప్రజలకు చెప్పేలోగానే వీళ్ళు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు. అయితే వీరు ఇలా వ్యవహరించడం పాకిస్తాన్‌ పన్నిన కుట్రలో ఇది భాగమని అంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయుడైన కులభూషన్‌ యాదవ్‌ కేసు విచారణ జరుగుతోంది. కులభూషన్‌ తమ దేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్న పాకిస్తాన్‌ అతనికి ఉరి శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ భారత్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే కులభూషన్‌ పై నేరారోపణ చేసేందుకు వీలుగా భారతీయ మీడియాలోనే కధనాలు స ష్టించింది పాకిస్తాన్‌. 2017లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కరణ్‌ థాపర్‌ వ్రాసిన వ్యాసం, 2018లో ప్రవీణ్‌ శర్మ ఫ్రంట్‌ లైన్‌ కధనం, క్వింట్‌లో చందన్‌ నంది కధనాలను ఇప్పుడు సాక్ష్యంగా చూపిస్తోంది. పాకిస్తాన్‌ కుట్రలో ఇది కూడా ఒక భాగం.

పాకిస్తాన్‌ 2016 కుట్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనిని 2016లో పాకిస్తాన్‌ ఎగువ సభకు చెందిన కమిటీ ఒకటి రచించింది. విధాన మార్గదర్శక ప్రణాళిక తయారీలో పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్‌ ఆసిఫ్‌, రక్షణ కార్యదర్శి, ప్రధాని సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌తో పాటు 13 మంది ఎంపిలు పాల్గొన్నారు. దీనిని 4 అక్టోబర్‌, 2016లో ఆమోదించారు.

పాకిస్తాన్‌ పట్ల కఠినమైన వైఖరి అవలంబిస్తున్న మోదీని తొలగించడానికి లేదా ఎదుర్కోవడానికి అమలుచేయాల్సిన 22 సూత్రాల ప్రణాళికను ఈ కమిటీ తయారుచేసింది. కాశ్మీర్‌ విషయమై భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై ప్రచారం సాగించడం కోసం అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందంటూ పదేపదే ఆరోపణలు చేయాలని ఆ కమిటీ సూచించింది.

ఈ ప్రణాళిక చాలా ప్రమాదకరమైనది. సమాజంలో విభేదాలు సష్టించడం ఇందులో ప్రధాన అంశం. అంటే జాతి, మతం మొదలైనవాటి ఆధారంగా ఘర్షణలు సష్టించడం. హిందూత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు చెప్పి క్రైస్తవులు, ముస్లిములు, దళితుల్లో భయాందోళనలు కలిగించడం. దీని కోసం మోదీ వ్యతిరేక మీడియా, మానవహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలన్నది ఆ ప్రణాళికలో భాగం.

ఈ ప్రణాళికను పాకిస్తాన్‌ ఇప్పటికే అమలులో పెట్టినట్లు కనిపిస్తోంది. క్రైస్తవులు, ముస్లింలు, దళితులపై దాడులు జరిపి, అవన్నీ మోదీ ప్రభుత్వం వల్లనే జరుగుతున్నాయని చిత్రీకరించే ప్రయత్నం ఇప్పటికే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వర్గాలలో హిందూత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఏదో చిన్న సంఘటనను ఆధారం చేసుకుని మీడియా, మేధావి వర్గం, కొన్ని పార్టీలు హిందూత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాయో ఇప్పుడు అర్థమవుతుంది. తన కుట్రపూరిత ప్రణాళికను అమలులో పెట్టే పనిని పాకిస్తాన్‌ అంతర్జాతీయ సంస్థలకు అప్పగించింది. అలా ఏ సంస్థల ద్వారా పని జరిపించాలన్నది కూడా ఎంపీ కమిటీ నిర్ధారించింది.

పాకిస్తాన్‌ సెనేట్‌ కమిటీ రిపోర్ట్‌ ప్రకారం సాగుతున్న ఈ కుట్ర వివరాలు ఇప్పుడు క్రమంగా సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధమవుతున్నాయి. దేశంలో చిన్నచిన్న కారణాలకే పెద్ద ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఎవరి కోసం దేశంలో కొందరు ఈ ఆందోళనలు చేస్తున్నారో స్పష్టమవుతోంది.

ఇస్లామాబాద్‌లో 2016లో జరగాల్సిన సార్క్‌ సమావేశాలకు హాజరు కాలేమంటూ బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక స్పష్టం చేయడంపై విచారాన్ని వ్యక్తం చేసిన పాకిస్తాన్‌ టర్కీ, ఇరాన్‌, చైనాలతో కూడిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోపరేషన్‌కు మాత్రం మద్దతు ప్రకటించింది. ఇది కూడా 2016 ప్రణాళికలో భాగమే.

6 జనవరి, 2016న పాకిస్తాన్‌ విదేశాంగ విభాగపు అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైజల్‌ ట్వీట్‌ చేస్తూ కులభూషన్‌ యాదవ్‌ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారని నిరూపించడానికి సాక్ష్యంగా క్వింట్‌లో ప్రచురితమైన కధనాన్ని చూపారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్నా విచారణలో కూడా పాకిస్తాన్‌ తరఫు న్యాయవాది ఇదే కధనాన్ని ఆధారంగా చూపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక క్వింట్‌ పాత్ర ఏమిటన్నది పరిశీలించవలసిన విషయం.