అమరవాణి


పునర్విత్తం పునర్మిత్రం

పునర్భార్య పునర్మిహి

ఏతత్సర్వం పునర్లభ్యం

న శరీరం పునఃపునః

భావం : పోయిన ధనం మళ్ళీ చేరుతుంది. దూరమైన మిత్రుడు చేరువవుతాడు. భార్య గతిస్తే మళ్లీ వివాహం చేసుకోవచ్చును. భూసంపద మళ్ళీ ప్రాప్తిస్తుంది. కానీ శరీరం మాత్రం మళ్ళీమళ్ళీ రాదు. అందుకే ఈ శరీరం ఉండగానే ధర్మకార్యాలు చేయాలి.