ప్రముఖులు మాటజమ్మూకాశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉన్నంతకాలం ప్రత్యేక హోదా ఉండాల్సిందే. 356వ అధికరణ, 35ఎ తొలగించడానికి వీలులేదు. అవి లేకపోతే విలీనానికి అర్థం ఉండదు.       

- ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత


35ఎ అధికరణ జమ్మూ కాశ్మీర్‌ పాలిట శాపంగా మారింది.దానిని పార్ల మెంట్‌లో మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి చేర్చలేదు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా దొడ్డిదోవన రాజ్యాంగంలో చేర్చారు. పెట్టుబడులురాక, వనరులులేక రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుప్పకూలడానికి కారణం ఈ అధికరణే.

- అరుణ్‌ జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి


ఉగ్రవాదులకు గతంలో బిర్యానీలు తినిపించారు. కానీ మేము తూటాలు తినిపిస్తు న్నాము. మసూద్‌ అజర్‌ వంటివారిని 'జీ'(గారు)అని గౌరవిస్తున్నారు. అలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ మేము దానిని సమూలంగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాము. అదీ వారికీ, మాకూ ఉన్న తేడా.

- యోగి ఆదిత్యనాథ్‌, యుపి ముఖ్యమంత్రి