పరిసరాల పరిరక్షణపై దృష్టి


పర్యావరణ పరిరక్షణ గురించి పని చేయబోతున్నదని ఈసారి పర్యావరణం, పరిసరాలను కాపాడుకుంటూ, వాటిని పరిరక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని సర్‌ కార్యవాహ సురేశ్‌ జీ జోషి ప్రకటించారు. 
ఇందుకోసం ప్రత్యేకంగా గతివిధి (కార్యవిభాగం) ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నూతనంగా చేపట్టనున్న ఈ కార్యం గురించి వివరంగా చెబుతూ పర్యావరణాన్ని కాపాడు కోవడం, దాన్ని పోషించుకోవడానికి సమాజంతో పాటు కలిసి పనిచేయడానికి నిర్ణయాలు జరిగాయన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టనుంది.

1. జల పరిరక్షణ

2. జల నిర్వహణ

3. మొక్కలు నాటటం.

వీటితోపాటు ప్లాస్టిక్‌ మరియు నాన్‌ బయోడీగ్రేడబుల్‌, థర్మోకోల్‌ లాంటి వస్తువులను తొలగించుట.

ఇదేకాకుండా 'సామాజిక సమరసత' పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.