'హిందూ తీవ్రవాదం' బూటకమని తేల్చిన కోర్టుస్వామి అసీమానందని నిర్దోషిగా ప్రకటించిన ప్రత్యేక న్యాయస్థానం

ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని తక్కువ చేయడం కోసం, స్వార్ధ ప్రయోజనాలను సాధించడం కోసం కొన్ని అంతర్జాతీయ శక్తులు 'హిందూ తీవ్రవాద' భూతాన్ని సృష్టించాలనుకున్నాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి ఎలాగైతే పాకిస్తాన్‌ కేంద్రమో అలాగే భారత్‌ 'హిందూ తీవ్రవాదానికి' పుట్టినిల్లని చూపాలని ప్రయత్నించాయి. 
ఈ కుట్రకు మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, వాటికి సంబంధించిన ప్రభుత్వాలు కూడా మద్దతునిచ్చాయి. హిందుత్వ సంస్థలకు చెందిన కొందరిపై లేనిపోని ఆరోపణలు చేసి, వారిని ఉగ్రవాద సంఘటల్లో ప్రధాన నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున సాగింది. మాలెగావ్‌ పేలుడు కేసులో సాధ్వీ ప్రజ్ఞా, సంఝౌత ఎక్స్‌ ప్రెస్‌ పేలుడు కేసులో స్వామి ఆశీమానందలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగింది. కానీ మాలెగావ్‌ కేసులో సాధ్వీ నిరపరాధి అని కోర్టులు ఇప్పటికే తేలిస్తే, ఇటీవల సంఝౌత పేలుడుతో ఆశీమా నందకు సంబంధం లేదని ఎన్‌ ఐ ఏ ప్రత్యేక కోర్ట్‌ తీర్పునిచ్చింది.

ఫిబ్రవరి 18, 2007 సంవత్సరంలో ఢిల్లీ - లాహోర్‌ నగరాల మధ్య నడిచే సంఝవుతా ఎక్ష్ప్రెస్‌ అంతర్జాతీయ రైలు హర్యానాలోని పానిపట్‌ జిల్లలో బాంబుదాడికి గురైంది. ఈ తీవ్రవాద దుశ్చర్యలో 68 మంది మరణించారు. మృతుల్లో 19 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు.

యుపియే ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణపై స్వామి అసీమానంద అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన అప్పటి జాతీయ దర్యాప్తు సంస్థ నిందితులు కుట్రపూరితంగా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.

ఎట్టకేలకు కేసుని విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక న్యాయస్థానం స్వామీ అసీమానందతో పాటు లోకేష్‌ శర్మ, కమల్‌ చౌహన్‌ మరియు రాజేందర్‌ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది.