ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ముందడుగు

 
ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడితో పాటు దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న కీలక సూత్రధారి, పాకిస్థాన్‌ కు చెందిన మసూద్‌ అజార్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భద్రతా మండలి విధించే ఆంక్షల జాబితాలో మసూద్‌ అజార్‌ పేరు చోటు చేసుకుంటుంది.

ప్రకృతి సేవలో తరించారు


మన భారతీయ జీవన విధానంలో ప్రకృతిని ఆరాధించడమనేది అనాదిగా వస్తున్నది. అందుకే మనం వృక్షాలను, నదీనదాలను, సముద్రాలను దేవతలుగా తలచి కొలుస్తాం. అయితే నేడు పెరిగిన నాగరికత ప్రభావం వల్ల అనేక రకాలుగా కాలుష్యం వృద్ధి చెంది ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోంది. అందుకోసమే చెట్లను పెంచాలని ప్రకృతిని కాపాడాలని చాలామంది నడుంబిగించారు. ఆ బాటలోనే ఇప్పటికీ నడుస్తున్నారు కూడా. అలాంటి వారిలో తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి ఎన్నో కష్టనష్టాలకు ఎదురీది ప్రకృతిని కాపాడారు ఈ మహిళలు. అందుకే భారత ప్రభుత్వంచే విశేష పురస్కారాలను అందుకున్నారు.

శ్రీ నృసింహ జయంతి


శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవ అవతారం నారసింహావతారం. కశ్యప ప్రజాపతి దితిగర్భాన హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులనే మహా వీరులైన రాక్షసులు జన్మించారు. హిరణ్యాక్షుడిని వరాహరూపంలో ఉన్న మహా విష్ణువు వధించాడు.

సంప్రదాయాలు ఎలా పాటించాలి? (స్ఫూర్తి)


ఒక శ్రీమంతుడైన వ్యాపారి ప్రతి ఉదయం దిక్కులన్నింటికీ నమస్కరించడం గౌతమబుద్ధుడు చూశాడు. అలా ఎందుకు చేస్తున్నావని అడిగాడు. అందుకు ఆ వ్యాపారి మా పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేనూ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. 

నిజచరిత్రను చెప్పాలి (హితవచనం)హిందూదేశం ఎల్లపుడూ ఏదో ఒక విదేశీ పాలనలో ఉండేది, దాని చరిత్ర నిరంతర పరాభవాల గాధ అంటూ అబద్దాలతోను, అవమానాల తోను కూడిన దుర్మార్గ ప్రచారం కొనసాగింది. 

ప్రముఖులు మాట


దేశంలో 2023కల్లా నక్సలైట్లు ఉండరు. నాలుగేళ్లలో వారిని పూర్తిగా అణచివేస్తాం. దేశ భద్రతకు, అభివృద్ధికి వీరు సవాలు విసురుతున్నారు. కాబట్టి వారిని పూర్తిగా ఎరివేస్తాం.

- రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి

అమరవాణి


నరస్య ఆభరణం రూపం

రూపస్య ఆభరణం గుణం |

గుణస్య ఆభరణం జ్ఞానం

జ్ఞానస్య ఆభరణం పౌరుషం ||

ఆతిథ్యం.. భారతీయ వ్యాపార వ్యవస్థలో అంతర్భాగం


26 నవంబర్‌ 2008వ సంవత్సరం.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం. ముంబైలోని తాజ్‌ హోటల్‌ రెండో అంతస్తులో ఒక వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. ఆ హాలు మేనేజర్‌ మల్లిక. ఆమె వయసు 24 మాత్రమే. అప్పుడే బయట కాల్పులు వినిపించాయి. ఆమె గొప్ప సమయస్ఫూర్తితో వెంటనే హాలులో ఉన్న విద్యుత్‌ దీపాలన్నీ ఆర్పేసి, అతిథు లందరినీ కుర్చీలు, టేబుళ్ల కింద నక్కి ఉండవల సిందని చెప్పింది. ఇంకొకమాట కూడా చెప్పింది. భార్య, భర్త ఒకేచోట ఉండవద్దు. అలా చేస్తే నష్టాన్ని కొంచెం తగ్గించుకోవచ్చునని చెప్పింది. ఉదయానికి అక్కడి పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది. ఒక కిటికీ నుంచి నిచ్చెన వేయించి మొత్తం అందరినీ ఆమె కిందకి దింపించింది. చివరిగా తాను దిగింది.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరెస్సెస్‌ కార్యకర్త మృతిజమ్మూ-కాశ్మీర్‌: రాష్ట్రంలోని కిష్ట్వార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్‌ కార్యకర్త చంద్రకాంత్‌ శర్మ మృతి చెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్‌ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్‌ శర్మని స్థానిక జిఎంసి ఆస్పత్రికి చేర్చారు. 

''వయం పంచాధికం శతం'' బౌద్ధం - హైందవం''గౌతమబుద్ధుని సందేశం హిందూ మతంపై చేసిన ఎలాంటి తిరుగుబాటు కాదు. అది ఒక విశుద్ధమైన హిందూమతాన్ని సిద్ధంపచేయడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. ఉపనిషత్తులలోని కొన్ని సిద్ధాంతాలను తీసుకుని వాటికి బుద్ధుడు ఒక నూత్న వ్యాఖ్యానాన్ని చేశాడు'' 
- సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం, 6వ సంపుటం, 480వ పుట.

కుట్రలు, కుతంత్రాలకు అంతమెక్కడ?


ప్రాచీన కాలం నుంచి ఈ దేశంలో వేదసంస్కృతి, హిందూజీవన విధానం విలసిల్లింది, విలసిల్లుతోంది. ఇక్కడ ఛప్పన్న(56) రాజ్యాలు ఉన్నప్పటికీ, వాటికి వేరువేరు రాజులు, పాలనా వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇది ఒకే దేశంగా నిలిచింది. దానికి కారణం ఇక్కడి సాంస్కృతిక ఏకత్వం. రాజ్యాలు, పాలకులు వేరైనా ప్రజలు, వారిని పాలించే రాజులు ఒకే జీవనవిధానాన్ని, సాంస్కృతిక విలువల్ని అనుసరించారు, పాటించారు. ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టువంటి వాటిలో ఎన్నో తేడాలున్నా వాటన్నింటికి ఆధారమైన సంస్కృతి, విలువలు మాత్రమం ఒక్కటిగానే ఉన్నాయి. 

భవ్యమైన హనుమాన్‌ శోభాయాత్రహనుమాన్‌ జయంతి సందర్భంగా (11 ఏప్రిల్‌) భాగ్యగనర్‌లో భవ్యమైన హనుమాన్‌ శోభాయాత్ర జరిగింది. విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంయుక్తంగా నిర్వహించిన యాత్ర గౌలిగూడ రామమందిరం నుండి ప్రారంభమై తాడ్‌ బండ్‌ హనుమంతుని దేవాలయం వద్దకు చేరుకుంది. దాదాపు రోజంతా సాగిన ఈ భవ్యమైన శోభాయాత్రలో 6 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం 27 కి.మీ పొడవున ఈ యాత్ర సాగింది. యాత్ర సాగిన దారి అంతా కాషాయ జెండాలతో నిండిపోయింది. భజనలు, సంకీర్తనలతో వీధులు మారుమ్రోగాయి.

నీటి యుద్ధాలు నివారిద్దాంమాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ

2002లో దేశంలో నీటి కరువు అధికంగా ఉండడంతో... అబ్దుల్‌ కలాంగారు 2070 వ సంవత్సరంలో నీటి కరువు ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక ఉత్తరం రాసారు.. ఆ ఉత్తరాన్ని ఒక బ్రిటిష్‌ పత్రికకు పంపించారు..!!

'వివక్ష' అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలుఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో 'నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?' పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్‌ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు దళిత వర్గానికి చెందినందుకు తనను ఆహ్వానించకుండా అవమా నించారంటూ గ్రామా సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఆ వార్త సారాంశం. ఈ వార్త వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ విభాగం ప్రయత్నం చేసింది.

పొదుపు మహిళల సహజ స్వభావంమన సంస్కృతిలో ధనానికి అధినేత లక్ష్మీదేవి. ఆ ధనాన్ని జాగ్రత్త చేసేది కూడా మహిళలే. మన సమాజంలో కుటుంబ నిర్వహణ, ఆర్థిక విషయాల నిర్వహణతో సహా మహిళల చేతులలోనే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు విడి కుటుంబాలుగా ఉన్నపుడు కూడా వారే కుటుంబ అవసరాలను, ఆర్థిక స్థితిగతులను సమన్వయం చేసేవారు.

వడదెబ్బ


నివారణ పద్ధతులు


-     ఉల్లిపాయరసాన్ని  ఒంటికి పట్టిస్తే వడదెబ్బ తగలకుండా నివారించవచ్చును.

-     వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలోగాని, రుమాలులోగాని నడినెత్తిన పెట్టి కట్టుకొని వెళితే వడదెబ్బ తగలదు.

దేవాలయాల నిర్వహణ అధికారం ప్రభుత్వానిది కాదు, భక్తులది - సుప్రీం కోర్ట్‌దేవాలయాలను ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవడం, వాటి నిర్వహణ చేపట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్ట్‌ ఆ బాధ్యత పూర్తిగా భక్తులకే అప్పచెప్పాలని అభిప్రాయపడింది. అలాగే దేవాలయాల నిర్వహణలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, వైఫల్యాల పట్ల కూడా కోర్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఒదిశలోని జగన్నాధ దేవాలయ నిర్వహణ గురించి దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని పరిశీలిస్తూ సుప్రీం కోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. 

క్రైస్తవ మతప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు


హైదరాబాద్‌: మాదాపూర్‌ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్‌ జాతీయులపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్‌ (28), హాజియా (30) షేక్‌ పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. టూరిస్ట్‌ వీసాపై ఫిబ్రవరిలో భారత్‌ వచ్చిన వీరు భారతీయ వీసా నిబంధనలకు విరుద్ధంగా చట్టవ్యతిరేకంగా మతప్రచారం, మత మార్పిడి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.