సంప్రదాయాలు ఎలా పాటించాలి? (స్ఫూర్తి)


ఒక శ్రీమంతుడైన వ్యాపారి ప్రతి ఉదయం దిక్కులన్నింటికీ నమస్కరించడం గౌతమబుద్ధుడు చూశాడు. అలా ఎందుకు చేస్తున్నావని అడిగాడు. అందుకు ఆ వ్యాపారి మా పెద్దవాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేనూ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. 
అప్పుడు బుద్ధుడు తూర్పుదిక్కుకు తలవంచి నమస్క రించడం తల్లిదండ్రులకు భక్తితోకూడిన కృతజ్జత తెలియజేయడం, పడమరదిక్కుకు నమస్కరించడం తన బాగోగులు పట్టించుకునే భార్యాపిల్లల్ని ప్రేమతో స్మరించడం, ఉత్తరదిక్కుకు  నమస్క రించడం సుఖ దుఃఖాలలో తనవెంట నడిచే సేవకులను గుర్తుచేసు కోవడం. దక్షిణదిక్కుకు నమస్కరించడం తనకు జ్ఞానాన్ని ఇచ్చే గురువులకు కృతజ్ఞత తెలియ జేయడం.

భూమికి నమస్కరించడం చుట్టూఉన్న వారందరికీ, ఆకాశంవైపు నమస్కారం సజ్జనులు, ప్రాజ్ఞులైనవారిని గుర్తుచేసుకోవడం అని వివరించాడు. సంప్రదాయాలను ఆచరించాలి. కానీ వాటి వెనుక అర్ధాన్ని తెలుసుకుంటే మరింత ఫలితం దక్కుతుంది.