ప్రముఖులు మాట


దేశంలో 2023కల్లా నక్సలైట్లు ఉండరు. నాలుగేళ్లలో వారిని పూర్తిగా అణచివేస్తాం. దేశ భద్రతకు, అభివృద్ధికి వీరు సవాలు విసురుతున్నారు. కాబట్టి వారిని పూర్తిగా ఎరివేస్తాం.

- రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి

సుప్రీం కోర్ట్‌ ప్రధాన న్యాయ మూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దురదృష్టకరం. జడ్జిలను ఇలా భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఇలాంటి ఆరోపణలు వ్యవస్థకు మంచిది కాదు. కొందరు న్యాయవాదులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.

- సోలి సొరబ్జీ, మాజీ అటార్నీ జనరల్‌

 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవిఎం)ను తప్పుపట్టడ మనేది అందరికీ అలవాటుగా మారిపోయింది. ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొనేవారు వాటి వినియోగాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతి కావా లంటారు. కానీ అందులో మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉంది.

- టిఎస్‌ కృష్ణమూర్తి, మాజీ ప్రధాన ఎన్నికల అధికారి