భవ్యమైన హనుమాన్‌ శోభాయాత్రహనుమాన్‌ జయంతి సందర్భంగా (11 ఏప్రిల్‌) భాగ్యగనర్‌లో భవ్యమైన హనుమాన్‌ శోభాయాత్ర జరిగింది. విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంయుక్తంగా నిర్వహించిన యాత్ర గౌలిగూడ రామమందిరం నుండి ప్రారంభమై తాడ్‌ బండ్‌ హనుమంతుని దేవాలయం వద్దకు చేరుకుంది. దాదాపు రోజంతా సాగిన ఈ భవ్యమైన శోభాయాత్రలో 6 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం 27 కి.మీ పొడవున ఈ యాత్ర సాగింది. యాత్ర సాగిన దారి అంతా కాషాయ జెండాలతో నిండిపోయింది. భజనలు, సంకీర్తనలతో వీధులు మారుమ్రోగాయి.

మహారాష్ట్ర శ్రీనాథ పీఠానికి చెందిన జితేంద్ర నాథ్‌జీ మహారాజ్‌ శోభాయాత్రను ప్రారంభించారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి కార్యదర్శి డా. భగవంత రావు, తెలంగాణా విహింప అధ్యక్షులు ఎం. రామరాజు, బజరంగ్‌ దాల్‌ రాష్ట్ర కన్వీనర్‌ భాను ప్రకాష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


వేలాది మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు భక్తులకు నీళ్ళు, పానీయాలు, ఆహారం అందజేశారు. మునిసిపల్‌ సిబ్బంది, నీటి సరఫరా శాఖ తగిన ఏర్పాట్లు చేశారు. 14వేల బలగాలను మోహరించిన పోలీసు శాఖ ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంది.