ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరెస్సెస్‌ కార్యకర్త మృతిజమ్మూ-కాశ్మీర్‌: రాష్ట్రంలోని కిష్ట్వార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరెస్సెస్‌ కార్యకర్త చంద్రకాంత్‌ శర్మ మృతి చెందారు. మంగళవారం ఉదయం తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో తొలుత చంద్రకాంత్‌ శర్మ అంగరక్షకుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్‌ శర్మని స్థానిక జిఎంసి ఆస్పత్రికి చేర్చారు. 
అనంతరం చికిత్స పొందుతూ చంద్ర కాంత్‌ శర్మ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న శర్మ, ఆ ప్రాంతంలోని తీవ్రవాద నిర్మూలన కార్యక్రమాలపై దృష్టి నిలిపినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో గతంలో అతనిపై హత్యాయత్నం బెదిరింపులు రావడంలో పోలీసులు అతని రక్షణ నిమిత్తం అంగరక్షకుడిని ఏర్పాటు చేశారు.

చంద్రకాంత్‌ శర్మ హత్య నేపథ్యంలో కిష్ట్వార్‌ ప్రాంతంలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఆప్రాంతంలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.