నీటి యుద్ధాలు నివారిద్దాంమాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఎంతో ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ

2002లో దేశంలో నీటి కరువు అధికంగా ఉండడంతో... అబ్దుల్‌ కలాంగారు 2070 వ సంవత్సరంలో నీటి కరువు ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక ఉత్తరం రాసారు.. ఆ ఉత్తరాన్ని ఒక బ్రిటిష్‌ పత్రికకు పంపించారు..!!

ఇది 2070..!!

నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను..!!

కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది..!!

నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను..!!

ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను, త్రాగలేను..!!

అంత నీరు ఇప్పుడు అందుబాటులో లేదు..!!

నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం..!!

ఇప్పుడున్న సమాజంలో..

అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని..!!

నాకు గుర్తుంది అప్పుడు నాకు 5 ఏళ్ళు..!!

అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది..!!

ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి..!!

ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి..!!

దాదాపు అరగంట పాటు షవర్‌ స్నానం చేసి ఆనందించేవాడిని..!!

కానీ ఇప్పుడా పరిస్థితి లేదు..!!

ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక..!!

అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు..!!

నాకు గుర్తుంది, నీటిని కాపాడండి,

సేవ్‌ వాటర్‌ అంటూ హెచ్చరికలు, వాల్‌ పోస్టర్లు ఉండేవి..!!

రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు..!!

కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు..!!

నీరనేది ఎప్పటికీ తరగని వనరని మా భావన..!!

కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు

డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి,

లేదా పూర్తిగా కలుషితమయ్యాయి..!!

పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది..!!

కార్మికులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు..!!

నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది..!!

రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి..

ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి..!!

నీటిబాటిల్‌ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు..!!

80% ఆహారం అంతా కత్రిమమే..!!

నీరు లేకపోతే ఏం పండుతుంది..??

గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి

రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు..!!

ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు..!!

అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు..!!

ఓజోన్‌ పొర లేని కారణంగా చాలా దారుణమైన

చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు..!!

చర్మక్యాన్సర్‌, మూత్రపిండ సంబంధిత

వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు..!!

గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం

ఇప్పుడు మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తోంది..!!

నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది..!!

బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది..!!.

20 వ శతాబ్దంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం,

అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది..!!

అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు..!!

కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు..!!

కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఇలా చెప్పాలని ఉంది...!!

ఈ భూమాతను కాపాడటానికి

ఇంకా మనకు సమయం మిగిలే ఉందని..కానీ అదెలా సాధ్యం..!!

మీ అబ్దుల్‌ కలాం...!!