వడదెబ్బ


నివారణ పద్ధతులు


-     ఉల్లిపాయరసాన్ని  ఒంటికి పట్టిస్తే వడదెబ్బ తగలకుండా నివారించవచ్చును.

-     వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలోగాని, రుమాలులోగాని నడినెత్తిన పెట్టి కట్టుకొని వెళితే వడదెబ్బ తగలదు.

-     నీరుల్లిపాయ రసం రెండు కణతలకు, గుండె ప్రదేశములో పూస్తే వడదెబ్బ వలన కలిగిన బాధలు తగ్గుతాయి.

-     వడదెబ్బ తగిలితే ముఖం, శరీరంపైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి, తాగటానికి నిమ్మరసంలో ఉప్పుకలిపి ఇవ్వాలి.

-     కుమ్ములో (కుంపటిలో) ఉడికించిన మామిడి కాయ రసంలో ఉప్పు, జీలకర్ర కలిపి భోజన సమయంలో తాగితే వడదెబ్బ తగలదు.

-     వడదెబ్బ తగిలినవారిని విశ్రాంతిగా పడుకో నిచ్చి ఆ తరువాత కాఫీ ఇస్తే తేరుకుంటారు.

-     చన్నీటిలో తేనె కలిపి ఇస్తే వడదెబ్బ నివారించ వచ్చును.

-     వడగళ్ళు పడినపుడు ఆ ఐస్‌ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇస్తే కోలుకుంటారు.

-     తరవాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వాలి.

-     తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించాలి.

-     నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసాన్ని  తాగించాలి.

-     వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించాలి.

    వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన పద్ధతులలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి.