సమైక్యత, సద్భావాన్నే ఎంచుకున్న ప్రజలు


ఈసారి ఎన్నికలు భారత్‌ గురించిన రెండు రకాల భావనల గురించి జరిగాయి. ఒకటి, ఆధ్యాత్మికత ఆధారంగా కూడిన సంపూర్ణమైన, విశాలమైన, సమన్వయపూర్వకమైన ప్రాచీన భావన. ప్రపంచమంతా హిందూ దక్పధం, హిందూ ఆలోచన అని గుర్తించేది దీనినే.

మరొకటి, భారత్‌ అంటే వివిధ అస్తిత్వాలు, గుర్తింపులు, వర్గాలు కలిగినది అనే భావన. ఇక్కడి సమాజాన్ని కులం, భాష, ప్రాంతం, మతం పేరున విభజించి తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చు కోవాలనుకున్నవారు సష్టించిన భావన అది. ఇలాంటివారు సహజంగానే సమన్వయపూర్వక, విశాల భావాన్ని వ్యతిరేకిస్తారు. తమ వాదన నెగ్గించుకునేందుకు అనేక భ్రమలు ప్రచారం చేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సైద్ధాంతీక సంఘర్షణ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది అంతిమ దశకు చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికలు ఈ సంఘర్షణలో ఒక ముఖ్య ఘట్టం. సమాజంలో ఏకత్వ భావన వెళ్లివిరిసి నప్పుడు విఘటన, విచ్ఛిన్న రాజకీయాలు సాగవు. అందుకనే ఎలాగైనా గెలుపు సాధించాలనే తాపత్రయంతో పరస్పర వ్యతిరేకత ఉన్నప్పటికీ, విఘటన శక్తులన్నీ ఏకమయ్యాయి.

కానీ వివేకవంతులైన భారత ప్రజానీకం మాత్రం అందరినీ కలిపి ఉంచే, అందరి అభివద్ధిని కాంక్షించే వారికే విజయాన్ని కట్టబెట్టారు. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఇందుకు సర్వ ప్రజానీకాన్ని ఎంతో అభినందిం చాలి. ఈ సైద్ధాంతీక పోరాటంలో దేశ ప్రయోజనలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకత్వం వహించిన, పనిచేసిన అందరికీ కూడా శుభాభినందనలు.

- డా. మన్మోహన్‌ వైద్య