భారత్‌ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది



''నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని,  వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్‌ శక్తి  ఏ-శాట్‌ మిస్సైల్‌, వివిధ మిలిటరీ, కార్టోశాట్‌ సిరీస్‌ శాటిలైట్లు అని అన్నారు. అతి తక్కువ పెట్టుబడులతో దేశీయంగా తయారు చేయడం, అందుకు అన్ని విధాల ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ఒక శుభపరిణామం'' అని శ్రీ ఉదయ భాస్కర్‌గారు, విశ్రాంత చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, తెలిపారు.

మే 24సాయంత్రం  రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అద్వర్యంలో రాష్ట్రీయ విద్య విహార్‌, అన్నోజీగూడ నిర్వహించబడిన ప్రథమ వర్ష ముగింపు సభ కార్యక్రమంలో శ్రీ ఉదయ కిరణ్‌గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ (అద్యక్షులు) శ్రీ బూర్ల దక్షిణామూర్తి ఉపన్యసిస్తూ నేటి దేశ పరిస్థితులలో సంఘ స్వయంసేవకుల పైన ఎంతో గురుతరమైన బాధ్యత ఉన్నదని దాన్ని విజయవంతంగా నెరవేర్చేం దుకు ఇక్కడ శిక్షణ పొందిన అందరూ తమ సర్వ శక్తులను ఒడ్డి పని చెయ్యాలని ఉద్బోధ చేసారు.

స్వయంసేవకులు చేసిన శారీరక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర సంఘచలాక్‌ శ్రీ నాగరాజు, 20 రోజుల వర్గకు వర్గాధికారిగా వ్యవహరించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ రాజేందర్‌ రావు కూడా ఉన్నారు.

 శ్రీ విద్య విహార్‌, అన్నోజీగూడలో జరిగిన ప్రథమవర్ష శిక్షావర్గలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి 285 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

శిక్షా వర్గాలో 20 రోజుల పాటు ఇచ్చే శిక్షణ జాతీయ, వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే విధంగా ఉంటుంది. శిక్షార్తులు ప్రతి రోజు ఉదయం 4:30ని నుండి రాత్రి 10 గం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శారీరిక్‌, బౌద్దిక్‌,మానసిక వికాస మునకు సంబంధించిన యోగ, దండ, నియుద్ధ సమత మొదలైన శారీరిక్‌ కార్యక్రమాలు, చర్చ, గోష్టి, కథ, ఉపన్యాసం మొదలైన బౌద్ధిక్‌ విషయాలలో శిక్షణ పొందారు. పరిసరాల పరిశుభ్రత సంఘ కార్యక్రమంలో ఒక భాగం. వర్గలో పాల్గొన్న అందరు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి రోజు పాల్గొన్నారు. అదే విధంగా పత్రిక రంగానికి సంబంధించిన శిక్షణ కూడా లభించింది.శిక్షా వర్గాలో పాల్గొనేందుకు స్వయంసేవకులు తమ గణవేష్‌ తామే సమకూర్చుకొని 20 రోజులు భోజన తదితర అవసరాలకు తగిన శుల్క కూడా చెల్లించారు. శిక్షావర్గలో 15 సం వయస్సు నుండి 40 సం మధ్య వయస్సు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివిధ వృత్తుల వారు పాల్గొన్నారు.