రాగులు (గృహ వైద్యం)


రాగుల  ఉపయోగాలు

-     వీటికి మరొక్క పేరు తవిదెలు, చోళ్ళు అని కూడా పిలుస్తారు.

-     రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.

-     శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును.

-     మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును.

-     రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును.

-     రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును. రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును.

-     కఫాన్ని పెంచును. చలవ చేయును.

-     శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

-     ఆకలిదప్పికలను అణుచును.

-     విరేచనం చేయును. రక్తంలోవేడిని తీయును.

-     రాగుల్లో  పిండిపదార్ధాలు 72.7 గ్రా, కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా, మాంసకత్తులు 7 గ్రా, క్యాల్షియం 330 మీ.గ్రా, భాస్వరం 270 మి.గ్రా, ఇనుము 5.4 మి.గ్రా, పొటాషియం 290 మి.గ్రా, పీచుపదార్థం 3.6 మి.గ్రా. శక్తి 331 కేలరీలు.

-     రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును.

-     మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

-     రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును.

-     రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్ర బంధన విడుచును.