ప్రముఖులు మాటదేశభద్రతకు సంబంధించి భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చును. వాటిని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం పెంచుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహ రించాలి.

- అజిత్‌ ధోవల్‌, జాతీయ భద్రతా సలహాదారు వచ్చే 50 ఏళ్ళలో దేశ జనాభా 150కోట్లకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇద్దరికి మించి పిల్లల్ని కనకూడదని చట్టం చేయాలి. ఈ నియమాన్ని పాటించని వారికి ఓటు హక్కు ఉండకూడదు. అలాగే వారు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి.

- బాబా రాందేవ్‌, యోగా గురువుఈవిఎం లను ఎవరూ ట్యాంపర్‌ చేయలేని విధంగా రూపొందించాం. దేశంలో ఎక్కడా వివి ప్యాట్‌లకు, ఈవిఎంలకు మధ్య చిన్న వ్యత్యాసం కూడా రాలేదు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- ఎం.వి. గౌతమ్‌, సీఎండి, బెల్‌