గిరిజన గ్రామాల్లో నిశ్శబ్ద యజ్ఞం


దేశవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం సాగు తోంది. కొండల్లో, లోయల్లో, సుదూర ప్రాంతాల్లో, గ్రామాల్లో, అడవుల్లో లక్షలాది మంది తృణమూల స్థాయిలో కార్యకర్తలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పంజాబ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు, బీహార్‌ నుంచి కేరళ వరకు గత 67 సంవత్స రాలుగా ఈ నిశ్శబ్ద యజ్ఞం సాగుతోంది.

ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ - సంస్కృత భాష


సంస్కృతం ఒక భాష మాత్రమే కాదు, అభ్యాసన పద్దతిని ప్రతిబింబించే ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ.

సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంత రాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రధాన స్రవంతి లోని పాఠ్యాంశాల నుండి అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను తీసివేస్తు న్నాయి. జీవితంలోని అన్ని దశలలో సంస్కృత భాష పునరుత్థానం కావడం అంటే అది మనదేశ నిజమైన స్ఫూర్తిని, దాని ఆత్మశక్తిని పునరుజ్జీవనం చేయడమే. సంస్కృత భాష ద్వారానే మనం మన పూర్వీకుల లోని శౌర్యపరాక్రమాలను, జ్ఞానతృష్ణను గ్రహించి గొప్ప నాగరికతలతో ఒకటిగా ఏర్పడ్డాము.

ప్రముఖులు మాటమాతృదేశాన్ని ప్రేమించనివాళ్ళకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. అలాంటివాళ్ళంతా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. మనం ఎక్కడ పుడతామో ఆ దేశాన్ని ప్రేమించడమనేది మనిషిలో సహజంగా ఉండే లక్షణం. అలా ఉండడంలేదంటే వారిలో ఏదో తేడా ఉన్నట్లే. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కంటే దేశం విడిచి వెళ్లిపోవడమే మంచిది.

- శ్రీశ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

అమరవాణి


అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం,

స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం

ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే

పంచామ్ర వాపీ నరకం న యాతీ

(వరాహ పురాణం)

గురు పౌర్ణమి


ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాపపూర్ణిమ జరుపుకొంటారు.

వ్యాసాయ విష్ణు రూపాయ

వ్యాస రూపాయ విష్ణవే

నమో వైబ్రహ్మనిధయే

వాసిష్టాయ నమోనమః

నాది కాదు (స్ఫూర్తి)


చంద్రశేఖర ఆజాద్‌ గొప్ప దేశభక్తుడు, విప్లవకారుడైనా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతనివద్ద ఒక్క అణా మాత్రమే మిగిలింది. అది ఖర్చయిపోతే రేపు ఎలా గడుస్తుందన్నది ప్రశ్న. కానీ ఆ రోజుకు ఆకలి తీరితే రేపటి గురించి ఆలోచించుకోవచ్చని అణాపెట్టి శనగలు కొనుక్కుని తినసాగాడు. తింటూ తింటూ చివరి పిడికిలి నోట్లో వేసుకోబోతుండగా చేతిలో ఏదో చల్లగా తగిలింది. చూస్తే అరచేతిలో పావలా బిళ్ళ. పావలా దొరకటంతో రేపటి సమస్య తీరినట్లే కదా అనిపించింది. కానీ అంతలోనే ఎంతో పేదవాడైన శనగలు అమ్మేవాడు గుర్తుకు వచ్చాడు. 

మనదైన విద్య కావాలి (హితవచనం)


పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే, వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నత్యాన్ని గురించి బోధించాలి.

దేశ, ధర్మ రక్షణ కోసం కలిసి పనిచేద్దాంప.పూ. సరసంఘచాలక్‌జీ తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్‌)

సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్‌ కార్యక్రమంలో పూ.సరసంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు..

ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య దినోత్సవం మరుసటి రోజు ఈ వర్గ ముగియడం ఇంకొక విశేషం

వందేమాతరం గౌరవించనివారు మన ప్రతినిధులా?


17వ లోకసభ ఎన్నికల్లో గెలుపొందిన లోకసభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా సమాజ్‌వాదీపార్టీ సభ్యుడు షఫీకుర్‌ రెహమాన్‌ ప్రమాణస్వీకారం చేసిన తరువాత 'వందేమాతరం' రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇస్లాంకు వ్యతిరేకమని దాన్ని మేం ఆలపించమని వ్యాఖ్యానించడం వివాదాస్పదమయింది. అదీ సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా సభలో ఉండగా సదరు సభ్యుడు అలా వ్యాఖ్యానించాడు. మతం కంటె, పార్టీ కంటె పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగం అమలయ్యే పార్లమెంటులో ఆచారసంహితను పాటించాలన్న ఇంగితం ఆ ఎంపీకి లేకుండా పోయింది. 

భారతీయతను సంరక్షిస్తూ భావితరాలకు అందివ్వాలి


మన భారతీయ సంస్కృతి, చరిత్ర అతి పురాతనమైనవి, అత్యంత విలువైనవి. కాలగమనంలో వచ్చే మార్పులను ఎదుర్కుంటూ సాగుతున్న ఈ సమయంలో మహోజ్వలమైన వారసత్వ సంపదను, జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ భావితరాల వారికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని శ్రీ కృష్ణదేవరాయ అన్నారు.

గో సంరక్షణ - చట్టాలు


గోవుకు మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది.  గో సంపద, ఇతర పశు సంపద గ్రామీణ ప్రాంతాల్లో చాలా కీలకమైనది. గో సంపద ఆధారంగా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తుం టాయి. నానాటికీ తరిగిపోతున్న గోవుల కారణంగా ఏర్పడుతున్న కరవు కాటకాల నేపథ్యంలో గో సంరక్షణ ప్రస్తుత కాలంలో ఒక తప్పనిసరి బాధ్యతగా మారింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ అనేక జాతి వ్యతిరేక పార్టీలు, సంస్థలు గోరక్షణ అంటే అదొక మతానికి వ్యతిరేకం అనే స్థాయికి తమ ప్రచారాన్ని తీసుకువచ్చాయి. 

గ్రామంలో వెల్లివిరిసిన సామరస్యం


కొంతకాలం క్రితం నాటి ఘటన.. 

హిందూ సమాజంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య సామరస్యాన్ని, సద్భావాన్ని నెలకొల్పే మహత్తర బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌. ఇందులో భాగంగా హిందూ ధర్మంలో పేర్కొన్న రీతిలో సాంప్రదాయబద్ధమైన 'ముని వాహన సేవ' నిర్వహించారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని తన భుజాలపై ఎక్కించుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లారు. ఈ చర్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివిధ వర్గాలకు చెందిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెరికాకు చెందిన వరల్డ్‌ రిలీజియస్‌ ఫోరమ్‌ తమ నివేదికలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

వెల్లుల్లితో వైద్యం (గృహ వైద్యం)


ఉపయోగాలు

-     శరీరములో కఫముని పొగొట్టును.

-     శ్లేష్మంని పొగొట్టును.

-     వాతము, బాలింతలకు వచ్చే సూతికా రోగము, టైఫాయిడ్‌ జ్వరం పొగొట్టును.

తెలంగాణ పండుగ - బోనాలు


సృష్టి అంతా అమ్మవారిమయమే...ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో  అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం . దీన్ని తెలంగాణ తెలుగు వారి పండుగగా అభివర్ణిస్తారు. ఈ బోనాల పండుగ  ఆషాఢ మాసం, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో కూడా నిర్వహిస్తారు. ఎక్కువగా ఆదివారం నాడు జరుపుకుంటారు. అంతేకాదు తెలంగాణాలో ఆషాఢ నవరాత్రులను కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం అంటే వర్షాకాల ప్రారంభ సమయం. వరినాట్లు మొదలయ్యే సమయం. అందుకని ఆ  సమయంలో తమ ఊరు, ప్రాంతం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో అల్లారుతూ ఉండాలని శాకంబరీ నవరాత్రులను, బోనాల పండుగను నిర్వహిస్తారు. ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకునే ఈ పండు గను ఈకింద చెప్పినట్లు నిర్వ హించుకుంటారు.

గుంటూరులో 'లవ్‌ జిహాద్‌' - 15 మందిపై కేసు నమోదుగుంటూరు అర్బన్‌ పరిధిలోని జరిగిన లవ్‌ జిహాద్‌ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్‌ సామాజిక వర్గానికి చెందిన యువతి శిల్పా జైన్‌ కుటుంబం గుంటూరు పట్టణంలోని బ్రహ్మం గారి మందిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాబాయ్‌ సంరక్షణలో ఉంటున్న యువతిపై బంగారం షాపులో పాలిష్‌ చేసుకునే స్థానిక యువకుడు ఖాజాఖాన్‌ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో ప్రలోభపెట్టాడు. పెళ్ళి చేసుకునేందుకు మతం మారాలంటూ మాయమాటలు చెప్పిన ఖాజాఖాన్‌, ఈనెల 14న తన అనుచరుల సహాయంతో యువతిని గుర్తుతెలియని మసీదుకి తీసుకెళ్లి  ఇస్లాం మతంలోకి మార్చాడు. అనంతరం ఆమె పేరును ఫాతిమా ఖాన్‌ గా మార్చివేశారు.

అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు


కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించివేసారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీశాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక సిలువను ఏర్పాటు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే అదనుగా ఇటీవల దాని పక్కనే ఒక చర్చిని నిర్మించేందుకు పునాదులు వేశారు.