ప్రముఖులు మాటమాతృదేశాన్ని ప్రేమించనివాళ్ళకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. అలాంటివాళ్ళంతా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. మనం ఎక్కడ పుడతామో ఆ దేశాన్ని ప్రేమించడమనేది మనిషిలో సహజంగా ఉండే లక్షణం. అలా ఉండడంలేదంటే వారిలో ఏదో తేడా ఉన్నట్లే. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కంటే దేశం విడిచి వెళ్లిపోవడమే మంచిది.

- శ్రీశ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

తలాక్‌ బిల్లుకు, మతానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ బిల్లు గురించి తొందరపడుతున్నా రెందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ 2017-19 మధ్య కాలంలో 543 తలాక్‌ కేసులు వచ్చాయి. వాటిలో 324 కేసులు సుప్రీం కోర్ట్‌ తీర్పు తరువాత వచ్చినవే.

- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి

 

 
తలాక్‌ చట్టం కంటే బహుభార్య త్వాన్ని నేరంగా పరిగణించే చట్టం చేస్తే ముస్లిం మహిళలకు ఎక్కువ ఊరట లభిస్తుంది. మొదటి భార్య బతికుండగానే రెండవ పెళ్లి చేసుకోవడాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకురావాలి.

- శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, ద్వారకా పీఠం