భారత ప్రతిభకు ఆకాశమే హద్దు


భారతీయులంతా మరోసారి గర్వంగా తలెత్తుకు నేట్లు చేసే అద్భుత ప్రయోగమే చంద్రయాన్‌-2. శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 2008 అక్టోబర్‌ 22న ప్రయోగించిన  చంద్రయాన్‌-1 కంటే ఇది చాలా మెరుగైనది.

అదొక ఆదర్శ గ్రామం


నిజమైన భారత్‌ గ్రామాలలో కనిపిస్తుందనేది ఎంత వాస్తవమో నిజమైన ఆదర్శ గ్రామాన్ని గుర్తించడమనేది కష్టం అనేది కూడా అంతే నిజం. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నర్సింగపూర్‌ జిల్లాలోని ఉన్న బఘువార్‌ గ్రామాన్ని సందర్శిస్తే, అలాంటి ఆదర్శ గ్రామానికి ఉండే లక్షణాల్లో ఏ ఒక్కటీ తక్కువ కాని ఒక గ్రామం మనం గుర్తించవచ్చు. బఘువార్లో మనకు స్పిక్‌ - స్పాన్‌ రోడ్లు, భూగర్భ నీటి పారుదల వ్యవస్థ, ప్రతి ఇంట్లో టాయిలెట్‌, అటలకు ఇండోర్‌ స్టేడియం, చివరికి వంట గ్యాస్‌ కోసం ''బయోగ్యాస్‌ ప్లాంట్లు'' కూడా నిర్మించుకున్నారు. గ్రామస్తులలో చక్కని సామరస్యం ఉంది.

ప్రముఖుల మాట


మాడిపోయిన రొట్టె పెట్టినందుకు, కూరగాయలు తెచ్చుకునేందుకు డబ్బు అడిగినందుకు, అసభ్య వీడియో చిత్రీకరణను అడ్డుకున్నందుకు కూడా ముస్లిం మహిళలకు తలక్‌ చెపుతున్నారు.

- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి

అమరవాణి


నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

భారతదేశమే విశ్వగురువు (హితవచనం)ప్రకృతి అంటే కేవలం భౌతికపరమైనదని భావించినా ఆధునికయుగం కంటే ముందు ప్రపంచంలో ఏదేశమూ శాస్త్ర విజ్ఞాన అనుసంధానం విషయంలో భారతదేశం వెళ్ళినంత దూరం వెళ్ళలేదు. అద్భుత విజయాలను సాధించనూలేదు.

రాజీలేని ఉద్యమ స్ఫూర్తి టంగుటూరి (స్ఫూర్తి)ప్రజల అభిప్రాయానికి భిన్నంగా సైమన్‌ కమీషన్‌ 1928లో మద్రాసును సందర్శించాలని నిర్ణయించుకున్న రోజులవి. సైమన్‌ కమీషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తాయి. సైమన్‌ గోబ్యాక్‌ అంటూ వేలాదిమంది సమర యోధులు నిషేధాజ్ఞాలను ఉల్లఘించి నినాదాలు చేయ సాగారు. నిరసనకారులపై బ్రిటీష్‌ పోలీసులు కాల్పులు జరపడంతో ఒక సమర యోధుడు మరణించాడు. అతని మృతదేహాన్ని సమీపించడానికి సైతం అనుమతించలేదు. దీంతో రగిలిపోయిన టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటీష్‌ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు దూసుకెళ్ళారు. ''మా సహచరుడి మృతదేహాన్ని చూసేందుకు నేను వెళ్లాల్సిందే నన్ను కాలుస్తారా.. కాల్చుకోండి'' అంటూ గర్జించారు.

శ్రీ హయగ్రీవ జయంతి


జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్‌|

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే||


హయగ్రీవుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మధు, కైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించినపుడు, శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో ఆ రాక్షసులను వధించి వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికి, వివేకానికి మూలం. ఆ వేదాలను రక్షించిన హయగ్రీవుడు జ్ఞానప్రదాత. హయగ్రీవుడు అంటే అశ్వపు(గుఱ్ఱం) శిరస్సు ఉన్నవాడు.

దేశవిభజనకు దారితీసిన విదేశీ కుట్ర


ప్రపంచంలో అతి ప్రాచీనమైనది, పుణ్యభూమి అయిన హిందూ దేశం 1947 ఆగస్టు 15 న కుట్ర పూరితంగా 'రెండు దేశాలు'గా విభజించ బడింది.

ఎంతో విషాదకరమైన ఈ చారిత్రక సంఘటన వెనుక పెద్ద చరిత్రే ఉన్నది. అయితే ఈనాటి తరానికి దేశ విభజన గురించి అవగాహన అంతగా లేకపోవడం దురదృష్టకరం.

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర


స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్ర గురించి తరుచు చర్చ జరుగుతుంటుంది. స్వతంత్ర సమరంలో ప్రత్యక్ష పాలుపంచుకోకపోయినా దేశకార్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పాత్రను మాత్రం ఎవరు కాదనలేరు.

హిందూ సమాజం మేల్కొంటోందికేంద్రంలో జాతీయవాదాన్ని బలపరిచే ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వస్థను లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్‌-2 విజయవంతమైంది. ఇది సహించలేని కొందరు మతమాఢ్యులు దేశంలో మతంపేరిట హిందూ దేవాలయాలపై, హిందువు లపై దాడులకెగబడుతున్నారు. ఢిల్లీ నగరంలో చాంద్‌నీ చౌక్‌లో వున్న దుర్గ ఆలయాన్ని కొందరు మతోన్మాదులు ధ్వంసం చేశారు. సిసి కెమెరాల ద్వారా 200 మంది రాళ్ళు విసురుతూ ఆ దాడికి పాల్పడినట్లు తెలిసింది. 

టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు రద్దు


నిరంకుశుడైన టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించిన 'టిప్పు జయంతి' వేడుకలను ప్రస్తుత యడ్యూరప్ప ప్రభుత్వం రద్దుచేసింది. వివిధ ప్రాంతాల నుండి వెలువడిన బలమైన నిరసనలను పరిగణనలోకి తీసుకుని టిప్పు జయంతి వేడుకలను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఈ వేడుకల వల్ల జరుగుతున్న నిరసనలు, మరణాలు, ఆస్తి నష్టాన్ని ఉదహరిస్తూ, ఈ వేడుకలు కొడగు జిల్లా ప్రజల మధ్య చీలికను సృష్టిస్తున్నాయని, కొడగు జిల్లా, విరాజ్‌పేటకు చెందిన స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు.

'విత్తన హక్కు' డిమాండ్‌ చేసిన కిసాన్‌ సంఘ్‌


హెచ్‌టిబిటి విత్తనాలు తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రభుత్వాన్ని కోరింది. విత్తనాలకు సంబంధించి ఎలాంటి పరీక్ష చేయ కుండా, అనుమతులు పొందకుండా వాటిని ఉత్పత్తి చేస్తున్నారని, అలాంటి విత్తనాల వాడకంలో అవగాహన, శిక్షణ లేని రైతులు వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కిసాన్‌ సంఘ్‌ ఆరోపించింది. నాణ్యమైన, సరైన విత్తనాలు పొందే 'హక్కు'  రైతుకు కల్పించాలని డిమాండ్‌ చేసింది.

పర్యావరణాన్ని కాపాడుదాం


మన ఇంటికి సంభందించిన బావి మరియు బోరులోని నీరు ఎండాకాలంలో కూడా ఎండి పోకుండా ఉండడానికి అతి తక్కువ ఖర్చుతో వర్షం నీటిని భూమిలోనికి పంపించే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు. 


సైన్ధవ లవణం (గృహ వైధ్యం)


ఉపయోగాలు

-     ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును.

-     శుక్రాన్ని వృద్దిచేయును.

-     హృదయముకు బలమును ఇచ్చును.

శుభాలను కలిగించే మాసం శ్రావణ మాసం


శ్రావణమాసం వస్తోందంటే చాలు ఇంట్లో మహిళలు ఇల్లు సర్దడంలో, పూజాసామాన్లు కొనక్కోవడంలో చాలా బిజీగా సమయాన్ని గడుపు తుంటారు. ఈమాసం మహిళల ప్రత్యేకమాసం అని చెప్పవచ్చు. పేరంటాళ్లతో, చుట్టాలతో, పూజలు, వ్రతాలునోములతో ఇల్లంతా రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. అంటే అంతటి మహిమాన్వితమైన మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చు. వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ముఖ్యంగా పూజాధికాలు నిర్వహించేందుకు అనువైనదిగా చెబుతారు. ఈ మాసంలో లక్ష్మిదేవిని, గౌరీదేవిని, శివకేశవు లిరువురినీ కొలువడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు

''జై శ్రీరామ్‌ అనలేదని దాడి''వార్తలు నిరాధారం - పోలీసుల స్పష్టీకరణ


'జై శ్రీరామ్‌' నినాదాలు చేయనందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఖలీద్‌ అనే 17 ఏళ్ల బాలుడికి నిప్పంటించారన్న వార్త నిరాధారమైనదని తేలింది. 'జై శ్రీరామ్‌' నినాదాలు చేయడానికి నిరాకరించి నందుకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ముస్లిం బాలుడికి నిప్పంటించారంటూ పేర్కొంటూ మీడియాలోని ఒక వర్గం నకిలీ వార్తలను సృష్టించి వ్యాప్తి చేసింది. ఈ ఘటనపై నిజానిజాలు పరిశీలిం చిన ఒక ఆంగ్ల దినపత్రిక స్థానిక పోలీసుల ప్రకటన, ఇతర వాస్తవాల ఆధారంగా ఒక కథనం ప్రచురిస్తూ ఆ ఘటన తాలూకు వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చింది.

అటవీ స్థలంలో నిర్మాణంలో ఉన్న అక్రమ మసీదు కూల్చివేతభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు అడ్డరోడ్డు వద్ద అటవీ స్థలంలో నిర్మాణంలో ఉన్న అక్రమ మసీదును అటవీ శాఖ అధికారులు తొలగించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జేసీబీ సాయంతో దీన్ని కూల్చేశారు.