పర్యావరణాన్ని కాపాడుదాం


మన ఇంటికి సంభందించిన బావి మరియు బోరులోని నీరు ఎండాకాలంలో కూడా ఎండి పోకుండా ఉండడానికి అతి తక్కువ ఖర్చుతో వర్షం నీటిని భూమిలోనికి పంపించే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు.  

ఈ ఫోటోలలో చూపిన విదంగా మన ఇంటిపైన మరియు ఆవరణలో పడిన వర్షం నీరు వృధాగా కాలువలో కలువకుండ ఆ నీటిని ఒక పైపు ద్వారా చుట్టూ మరియు అడుగున రంద్రాలు చేసిన ప్లాస్టిక్‌ డ్రంబులలోనికి పంపడం వలన ఆ నీరు భూమిలోనికి ఇంకి మన ground water level పెరుగుతుంది. దీనికి సిమెంటు, ఇటుక, ఇసుక, తాపీమేస్త్రీల అవసరంలేదు. కేవలం ప్లాస్టిక్‌ డ్రంబు కంటే కొంచెం లోతు, వెడల్పు ఎక్కువగా గొయ్యి చేసి దాని అడుగు భాగంలో రెండు ఫీట్ల వరకు చిన్న చిన్న రాల్లు ఇటుక ముక్కలతో నింపి దానిపైన డ్రంబు ఉంచి చుట్టూ రాల్లు ఇటుకలతో నింపి పైన మట్టితో కప్పివేయాలి. అంతే ఈవిదంగా ఎన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత ఎక్కువ నీరు ఇంకుతుంది. ఖర్చు చాలా తక్కువ. లాబం చాలా ఎక్కువ. దీనికి పగిలిన పనికిరాని డ్రంబులు కూడా వాడవచ్చు. రానున్నది వర్షాకాలం కనుక ఇప్పుడే ఈవిధంగా మనం అందరం మన ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకుందాం.