ప్రముఖుల మాట


మాడిపోయిన రొట్టె పెట్టినందుకు, కూరగాయలు తెచ్చుకునేందుకు డబ్బు అడిగినందుకు, అసభ్య వీడియో చిత్రీకరణను అడ్డుకున్నందుకు కూడా ముస్లిం మహిళలకు తలక్‌ చెపుతున్నారు.

- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి
కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 35 ఏ, 370 అధికరణలను తొలగించడానికి వీల్లేదు. మేము భారతీయులమేకానీ, మాకు ఆ అధికరణలు చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మా మూలాలను కాపాడుతున్నాయి.

- ఫరూఖ్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత
సంస్కృతం తెలియకపోతే భారత్‌ను  పూర్తిగా అర్ధం చేసుకోవడం కష్టం. గిరిజన భాషలతో సహా అన్ని భాషల్లో కనీసం 30శాతం సంస్కృత పదాలే ఉన్నాయి. అందుకనే మనం ఎక్కడకు వెళ్ళిన నాలుగు నెలల్లో స్థానిక భాష నేర్చుకోగలుగుతున్నాం.

- డా. మోహన్‌ భాగవత్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఘచాలక్‌