హిందూ సమాజం మేల్కొంటోందికేంద్రంలో జాతీయవాదాన్ని బలపరిచే ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఏడాది 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వస్థను లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్‌-2 విజయవంతమైంది. ఇది సహించలేని కొందరు మతమాఢ్యులు దేశంలో మతంపేరిట హిందూ దేవాలయాలపై, హిందువు లపై దాడులకెగబడుతున్నారు. ఢిల్లీ నగరంలో చాంద్‌నీ చౌక్‌లో వున్న దుర్గ ఆలయాన్ని కొందరు మతోన్మాదులు ధ్వంసం చేశారు. సిసి కెమెరాల ద్వారా 200 మంది రాళ్ళు విసురుతూ ఆ దాడికి పాల్పడినట్లు తెలిసింది. 
నినాదాలిస్తూ హిందువుల ఇళ్ళమీద కూడా దాడి చేశారు. అమ్‌ఆద్మీ పార్టీ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ ఈ గొడవలకు సూత్రదారి కూడా. ప్రభుత్వం 17 మందిని అరెస్టు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ నోరు విప్పలేదు. జూన్‌ 30 నాడు ఈ దాడి జరిగింది. ఎన్నికల్లో ఓడినా మత ఘర్షణలు జరిపి శాంత్రి భద్రతలకు భంగం కలిగిస్తే హిందూ సమాజం భయపడి బిక్కచచ్చి ఉంటుందని ఈ వర్గాల ఆలోచన. కానీ వాళ్ళ అంచనాలు తప్పాయి.  మందిరాన్ని వెంటనే పునరుద్ధరించుకున్న స్థానికులు సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశేషం ఏమిటంటే అందులో ముస్లిములు కూడా పాల్గొన్నారు.

 ఝార్ఖండ్‌లో రిచాభారతి అనే పేరుగల ఓ కళాశాల విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో ముస్లిం తీవ్రవాదాన్ని అక్షేపిస్తూ ఒక పోస్టునుంచింది. కాశ్మీరులో ముస్లింల నుంచే ఎందుకు తీవ్రవాదులు తయారవుతున్నారన్నది అమె పోస్టింగ్‌ సారాంశం. తమ స్వస్థలాల నుంచి తరిమివేయబడిన కాశ్మీరీ పండితులు ఎందుకు తీవ్రవాదులుగా మారడంలేదని ఆమె ప్రశ్నించింది. ఆమె పోస్టింగ్‌ను  దాన్ని తప్పుబట్టిన సాదర్‌ అంజుమన్‌ కమిటికి చెందిన ఖలీపా జులై 12, 2019 నాడు పితోరియా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అది మత సామరస్యానికి భంగకరమని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పితోరియ పోలీసులు వెంటనే ఆ అమ్మాయిని అరెస్టు చేశారు. ఆ అమ్మాయిని విడుదల చేయాలని అనేక హిందూ సంస్థలు ఆందోళన నిర్వహించాయి. జిల్లా ఎస్‌పి హామీ మేరకు ఆందోళన విరమించాయి. జార్ఖండ్‌లో స్థానిక కోర్టు మెజిస్ట్రేట్‌ మనీష్‌కుమార్‌సింగ్‌ ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ, ఖురాన్‌ ప్రతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో పంచమని షరతు విధించాడు. ఒక ప్రతిని ఫిర్యాదుదారుడు ఖలాఫాకు బహుకరించమని మెజిస్ట్రేట్‌ ఆదేశాలిచ్చాడు. అయితే తాను ఆ పని చేయలేనని రిచా బదులిచ్చింది. ముస్లింలు కూడా హిందువుల ఆచారాలపై అనేక అభ్యంతరకరమైన పోస్టులు పెడ్తున్నారని వారికే నాడైనా శిక్షపడిందా? అని ఆమె ప్రశ్నించింది.  రామాయణం, హనుమాన్‌చాలీసా ప్రతులను పంచమని కోర్టైనా ఆదేశించిందా? అని జీ న్యూస్‌ విలేఖరితో అంది. రిచాభారతి విడుదలకు పెట్టిన షరతును తరువాత కోర్టు కొట్టివేసింది. ప్రజల ఆందోళనతో ఇది సాధ్యమైంది.

కర్ణాటకలోని జగత్ప్రసిద్ధ హంపి క్షేత్రంలో శ్రీ కృష్ణ దేవరాయలవారి రాజగురువు శ్రీ వ్యాస తీర్థుల వారి బృందావనం ఉంది. శ్రీ వ్యాసతీర్థుల వారికి మధ్వసాధువుల్లో ప్రత్యేక స్థానముంది. ఆయన ఆధ్యాత్మిక సాధనతో అద్వైతం, విశిష్టాద్వైతం మీద దాడిచేస్తున్న మేధావుల నోరు మూయించారు. గొప్ప సామాజిక సేవకుడు.  వ్యాససముద్రం చెరువును త్రవ్వించారు. అది వ్యవసాయదారులకెంతో ఉపయోగపడింది. కనకదాసు అనే భక్తుడ్ని సన్మానించాడాయన. హంపి నుంచి తిరుమలవరకు 700 హనుమాన్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 1539లో ఆయన బృందావనంలో ప్రవేశించారు. ఈ బృందావనంలో తొమ్మిదిమంది హిందూ ఆచార్యుల సమాధులు, అనేక కళాఖండా లున్నాయి. ఈ నవబృందావన క్షేత్రం తుంగభద్రా నది పాంత్రంలో వున్న కొప్పల్‌ ద్వీపంలో ఉంది. ఈ మధ్య కొందరు దుండగులు దాడులకు పాల్పడి అక్కడి కళాఖండాలను ధ్వసం చేశారు. ఇది కొందరు గుప్త నిధులకోసం చేస్తున్న విధ్వంసంగా మీడియా ప్రచారం చేసింది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిందూ భక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కళాఖండాలన్నింటిని పునరుద్ధరించారు. వీరిలో అన్ని కులాలకు చెందినవారూ ఉండడం విశేషం. జూలై 17 గురుపూర్ణిమ నాడు ఇది జరగడం హిందువులకు అవమానకరమైనప్పటికీ 20 గంటల్లో దాన్ని పునరుద్ధరించడం హిందువుల్లో పెల్లుబుకుతున్న ఆత్మాభిమానానికి, అత్మవిశ్వాసానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

- హనుమత్‌ప్రసాద్‌