భారతదేశమే విశ్వగురువు (హితవచనం)ప్రకృతి అంటే కేవలం భౌతికపరమైనదని భావించినా ఆధునికయుగం కంటే ముందు ప్రపంచంలో ఏదేశమూ శాస్త్ర విజ్ఞాన అనుసంధానం విషయంలో భారతదేశం వెళ్ళినంత దూరం వెళ్ళలేదు. అద్భుత విజయాలను సాధించనూలేదు.

గణితం, జ్యోతిష్యం, రసాయన శాస్త్రం, ఔషద విజ్ఞాన, శల్య చికిత్స మొదలైన ప్రాచీన కాలంలో ప్రచారంలో ఉన్న సమస్త విజ్ఞాన శాస్త్రాలలో అగ్రస్థానంలో ఉండటమే కాదు. గ్రీకులు, అరబ్బులకు కూడా గురుస్థానంలో ఉండేది.

గ్రీకు, అరబ్బు దేశాల నుండి తనకు లభించిన శాస్త్ర విజ్ఞాన అనుసంధానాన్ని గ్రహించిన ఐరోపా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని నిలబెట్టగల ఆధారాలు హస్తగతం చేసుకొంది.

- యోగి శ్రీ అరవిందులు