రాజీలేని ఉద్యమ స్ఫూర్తి టంగుటూరి (స్ఫూర్తి)ప్రజల అభిప్రాయానికి భిన్నంగా సైమన్‌ కమీషన్‌ 1928లో మద్రాసును సందర్శించాలని నిర్ణయించుకున్న రోజులవి. సైమన్‌ కమీషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తాయి. సైమన్‌ గోబ్యాక్‌ అంటూ వేలాదిమంది సమర యోధులు నిషేధాజ్ఞాలను ఉల్లఘించి నినాదాలు చేయ సాగారు. నిరసనకారులపై బ్రిటీష్‌ పోలీసులు కాల్పులు జరపడంతో ఒక సమర యోధుడు మరణించాడు. అతని మృతదేహాన్ని సమీపించడానికి సైతం అనుమతించలేదు. దీంతో రగిలిపోయిన టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటీష్‌ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు దూసుకెళ్ళారు. ''మా సహచరుడి మృతదేహాన్ని చూసేందుకు నేను వెళ్లాల్సిందే నన్ను కాలుస్తారా.. కాల్చుకోండి'' అంటూ గర్జించారు.

పేదరికంలో జన్మించి, న్యాయ వాదిగా ఎంతో సంపాదించి, ఆ సంపాదనంతా  స్వాతంత్య్ర పోరాటంకోసం ఖర్చుచేసి, చివరకు పేదరికంతో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి, జాతీయవాద రచయిత, ప్రచురణకర్త ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.