భారత్‌లో 'కలిసిన' జమ్మూకశ్మీర్‌


జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక స్వయంప్రతిపత్తికి సంబం ధించిన ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభ్యలో ప్రతిపాదించన ఆర్టికల్‌ 370 రద్దు ప్రతిపాదన బిల్లు భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌. వెనువెంటనే ఆమోదిస్తూ జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్లాస్టిక్‌ను పారద్రోలేలా...


పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే అతి ముఖ్యమైన పదార్థాలలో ప్లాస్టిక్‌ ఒకటి అని మనందరికీ తెలిసిందే... చాలామంది ప్లాస్టిక్‌ వాడ కాన్ని తగ్గించాలని రకరకాల ఉద్యమాలను కూడా నిర్వ హిస్తున్నారు. అలా తన స్వరాష్ట్రమైన తమిళనాడులో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించా లని ఓ యువకుడు అనుకున్నాడు. అందుకోసం అమెరికాలోని తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. మొక్కజొన్న, కూరగాయాలు, కాగితపు వ్యర్థాల నుండి పర్యావరణహిత సంచులను రూపొందించాడు. ఆ సంచులు కేవలం మూడు నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. అంతేకాకుండా భూమి సారతకు ఎటువంటి నష్టాన్ని కలిగించవు. కాగితంలాగా బూడిదయ్యే విధంగా బయోడిగ్రేడబుల్‌ సంచులను అందుబాటులోకి తెచ్చాడు. అంతేకాకుండా కరిగిపోయే విధంగా ఆ పర్యావరణహిత సంచులు ఉండడం మరో విశేషం.

శ్రీ వామనావతారం


(సెప్టెంబరు 10న జయంతి)


శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారము వామనావతారం. వామనుడు అదితి, కశ్యపులకు జన్మించాడు. పుట్టిన కొన్ని క్షణములలోనే భగవానుడు విచిత్రంగా వటుని రూపం ధరించాడు. ఏడు సంవత్సరాల బాలుడిగా కనపడెను. తండ్రి కశ్యపుడు బాలుడికి ఉపనయనం చేశాడు.

సంవేదన ఉండాలి (స్ఫూర్తి)


డా. ఎస్‌ రాధాకృష్ణన్‌ సంవేదనశీలత గురించి ఒక కథ చెపుతుండేవారు. ''ఒక దైవభక్తుడు స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ బంగారపు కిరీటం అతనికి పెట్టారు. కానీ అక్కడ ఉన్న మిగిలినవారి కిరీటాల్లో మణులు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ భక్తుడు నా బంగారపు కిరీటంలో మణులు ఎందుకు లేవు? అనడిగాడు. 

సమయం వృదా చేసుకోవద్దు (హితవచనం)


ప్రాచీనమైన విషయాలన్నీ శ్రేష్ఠమైనవి కాకపోవచ్చు. అశాస్త్రీయమైన, అసంబద్దమైన ఆలోచనలు సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలం చెల్లిన వాటిని పట్టుకొని వ్రేలడవద్దు.

అమరవాణి


అల్పాక్షరరమణీయం యః

కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ

బహువచన మల్పసారం యః

కథయతి విప్రలాపీ సః

ప్రముఖుల మాటపర్యావరణ పరిరక్షణ కోసం మహిళలు ప్లాస్టిక్‌ సంచులు వాడవద్దు. వాటికి బదులు బట్ట సంచులు వాడండి. అవి పదేళ్ల పాటు మన్నుతాయి. వీటిని వాడటం ద్వారా మీరు ఎంతో మేలు చేసిన వారవుతారు. ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి భూమిని కాపాడినవారవుతారు.  

- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

గణపతిం భజే...


మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ రోజు చేసే గణేశపూజ కష్టాలను తొలగిస్తుందని పెద్దల మాట. రెండవది దూర్వా గణేశ వ్రతం. ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారు. దీన్ని శ్రావణ కార్తీక శుద్ధ చతుర్థినాడు చేస్తారు. మూడవది సిద్ధి వినాయక వ్రతం. భాద్రపద శుద్ధ చతుర్థినాడు చేస్తారు. దీన్నే వినాయకచవితి అంటాం. నాలుగవది కపర్ది వినాయక వ్రతం. శ్రావణ శుద్ధ చతుర్ధి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు నెలరోజులపాటు ఒంటిపూట భోజనం చేస్తూ కపర్ది వినాయకుణ్ణి పూజిస్తారు.

ప్రపంచదేశాల్లో పాకిస్తాన్‌ ఏకాకి


పుల్వామాలో తీవ్రవాదుల దాడులకు ప్రతిచర్యగా బాలాకోట్‌పై బాంబుల వర్షం కురిపిం చిన భారతసైన్యం మెరుపుదాడికి పాకిస్తాన్‌కు దిమ్మదిరిగినట్లైంది. ఆ తరువాత జరిగిన ప్రతీకార దాడుల్లో పట్టుబట్ట భారత్‌ పైలట్‌ అభినందన్‌ను ఒక్కరోజులో పాకిస్తాన్‌ విడిచిపెట్టడం, భారత్‌ చేసిన మెరుపుడాడుల్ని అన్ని దేశాలు సమర్థించడం, చివరకు పాకిస్తాన్‌ తీవ్రవాది మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటిం చడం, దీనిని చైనా కూడా వ్యతిరేకించకపోవడంతో పాకిస్తాన్‌ ప్రపంచ దేశాల్లో ఏకాకి అయింది.

భారతీయ చరిత్రలో మహిళ


సమాజంలో స్త్రీ నిర్వహించాల్సిన పాత్ర గురించి భారతీయ, పాశ్చాత్య దృష్టిలో ఎంతో తేడా ఉంది. భారతీయ సమాజంలో స్త్రీ, పురుషులది పరస్పర పూరకమైన పాత్ర. మన చరిత్రలో మరుగున పడిన అనేక విషయాలను వెలికి తీయ గలిగితే సమాజంలో ప్రముఖ పాత్ర నిర్వర్తించిన మహిళల గురించి కూడా తెలుస్తుంది. స్త్రీ, పురుషుల చరిత్ర విడివిడిగా ఉండదు''అని గోవా గవర్నర్‌ శ్రీమతి మృదుల సిన్హా అన్నారు.

గోమాతనూ వదలని ఓటు బ్యాంకు రాజకీయం!


దేశంలో గోవధ నిషేధం అత్యధిక ప్రజల ఆకాంక్ష. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో కూడా దీనిపై విస్తృత చర్చలు జరిగాయి. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం జరగాలని, దీనికి రాజ్యాంగ భద్రత ఉండాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గోవధ నిషేధం అంశాన్ని మతపరమైన అంశంగా పరిగణించి, మరొక వర్గాన్ని సంతృప్తిపరచేందుకు అప్పటి కాంగ్రెస్‌  నేతృత్వంలోని రాజకీయ వ్యవస్థ దీనిని 'కోతి పుండు బ్రహ్మరాక్షసి'లా తయారు చేసింది. వివిధ స్థాయిల్లో కోర్టులు కూడా వివిధ సందర్భాలలో ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా తాత్సారం చేశాయనే చెప్పుకోవాలి.

మతమార్పిడి నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ


రాష్ట్రంలో బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురానుంది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారంనాడు ఏకగ్రీవం గా ఆమోదించింది. పార్టీలకు అతీతంగా హిమాచల్‌ అసెంబ్లీ సభ్యులందరూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. సీపీఐ ఎమ్మెల్యే రాకేష్‌ సింఘా మాత్రమే ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ


 మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం

నిద్ర - నియమాలు


ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర సక్రమంగా ఉండాలి. నిద్ర వలన శ్రమ, అలసట పోతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరం నీరసంగా తయారవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. నిద్ర రెండురకాలు. అవి  1. గాఢనిద్ర. 2 . కలతనిద్ర.

హిందూ సంస్థల సంఘటిత శక్తి ఫలితం.. శ్రీశైలం అవినీతి ఈవో బదిలీ


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైనది అయినటువంటిది శ్రీశైల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎండోమెంట్‌ దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే గత కొంత కాలంగా శ్రీశైల దేవస్థాన పరిపాలనా విభాగంలో అన్యమత ఉద్యోగుల నియామకం, దేవస్థానానికి చెందిన టెండర్లను, లైసెన్సులను ముస్లిములకు కట్టబెట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎ. శ్రీరామచంద్ర మూర్తి మద్దతు ఉండటంతో హిందువుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది.