అమరవాణి


అల్పాక్షరరమణీయం యః

కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ

బహువచన మల్పసారం యః

కథయతి విప్రలాపీ సః

భావం : కొద్దిమాటలలోనే మనోహరముగా ఎవడు మహావిషయమును చెప్పగలడో అతడే వాక్‌ నైపుణ్యం కలవాడు.అట్లుగాక అల్పవిషయము పలుమాటలలో చెప్పి విసుగెత్తించువాడి మాట ఎవరూ వినరు.