ప్రపంచదేశాల్లో పాకిస్తాన్‌ ఏకాకి


పుల్వామాలో తీవ్రవాదుల దాడులకు ప్రతిచర్యగా బాలాకోట్‌పై బాంబుల వర్షం కురిపిం చిన భారతసైన్యం మెరుపుదాడికి పాకిస్తాన్‌కు దిమ్మదిరిగినట్లైంది. ఆ తరువాత జరిగిన ప్రతీకార దాడుల్లో పట్టుబట్ట భారత్‌ పైలట్‌ అభినందన్‌ను ఒక్కరోజులో పాకిస్తాన్‌ విడిచిపెట్టడం, భారత్‌ చేసిన మెరుపుడాడుల్ని అన్ని దేశాలు సమర్థించడం, చివరకు పాకిస్తాన్‌ తీవ్రవాది మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటిం చడం, దీనిని చైనా కూడా వ్యతిరేకించకపోవడంతో పాకిస్తాన్‌ ప్రపంచ దేశాల్లో ఏకాకి అయింది.

పదేపదే అబద్ధాలు చెబుతాడన్న ప్రఖ్యాతి గాంచిన అమెరికా అధ్యక్షుడు కాశ్మీరు విషయంలో భారత్‌ తన జోక్యాన్ని కోరిందని చెప్పిన అబద్ధం కూడా జి-7 శిఖరాగ్ర దేశాల సమావేశంలో మోదీ అమెరికా అధ్యక్షుడి ముందే తెల్చిపారేశారు. 'పాకిస్తాన్‌ 1947కు ముందు తమ దేశంలో భాగమని పాకిస్తాన్‌తో తాము ఏ విషయమైనా ద్వైపాక్షికంగా తేల్చుకోగలమని, ఇంకో దేశం ఇందులో తలదూర్చి కష్టపడనక్కరలేదని' మోదీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చివరికి షాంఘై సహకారసంస్థ సమావేశంలో పాల్గొనేందుకు కూడా మోదీ పాకిస్తాన్‌ గగనతలాన్ని ఉపయోగించలేదు.

ఆగస్టు 6న పార్లమెంటులో 370 ఆర్టికల్‌ రద్దు, కాశ్మీరు విభజన ఆమోదం పొందిన తరువాత పాకిస్తాన్‌ మరింత ఇరకాటంలో పడింది. ఏం మాట్లాడాలో తెలియని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ తమ వద్ద అణ్వాయుధాలున్నాయని, తమ దేశంలో ఇంకా 4000 మంది తీవ్రాదులుండవచ్చని అంటూనే మరోప్రక్క ఏ ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని అన్నాడు. కొన్నిరోజుల క్రితం విడుదల అయిన అమెరికా నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో సైన్యం రాజకీయాలను శాసిస్తోందని, ఇమ్రాన్‌ఖాన్‌ సైన్యం పహారాతో, ఐయస్‌ఐ తీవ్రాదుల అండతో వారినీడలో పాలన సాగిస్తున్నా రని తెలుస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నుకోబడ్డ ప్రధాని కాదని సైన్యంతో నియమింపబడ్డ ప్రధాని అని అమెరికా న్యాయవాదుల అభిప్రాయాలతో వెలువడిన ఆ నివేదిక తెలియజేస్తున్నది. ఇది ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టిదెబ్బ. విదేశాంగ, భద్రతా విధానాలన్నీ సైన్యమే నిర్ణయించడం, ఆయన ప్రసంగాలన్నీ సైన్యం తయారుచేసి ఇవ్వడం - ఇవన్నీ ఇమ్రాన్‌ఖాన్‌ ఏ నిర్ణయమూ చేయలేని దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. ఈ తరహా విధానం ఐక్యరాజ్యసమితిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా స్పష్టంగా కశ్మీర్‌ భారత్‌ అంతరంగిక వ్యవహారమని తేల్చి చెప్పింది. ఏమి చేయలేని ఇమ్రాన్‌ఖాన్‌ అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు.

ఆగస్టు 5న భారత్‌ పార్లమెంటు కశ్మీరు 370 అధికరణం రద్దు చేయ్యడం ద్వారా 'హిందూ దేశం హిందులది మాత్రమే' అని చెబుతోందని, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమని ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను దూషించడం ప్రారంభించాడు. దేశ ప్రజలనుద్దే శించి చేసిన ప్రసంగంలో ఆయన తీవ్రవాదంపై పాకిస్తాన్‌ ఏం చర్యలు తీసుకుందో చెప్పకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ను దూషించేందుకే పూర్తి సమయం కేటాయించాడు. పనిలోపనిగా ఆయన ఇస్లాం గొప్పతనాన్ని కూడా ఉటంకించాడు. కాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అర్థంకాని విషయమేమిటంటే, ఇస్లామిక్‌ దేశాలన్నీ పాకిస్తాన్‌ను దూరం పెడుతున్నాయి, పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని నిరసిస్తున్నాయి. భారత్‌ తీసుకున్న చర్యలవల్ల ఖీూుఖీ (ఖీఱఅaఅషఱaశ్రీ ూష్‌ఱశీఅ ుaరస ఖీశీతీషవ)  పాక్‌ను బ్లాక్‌లిస్టు చేసింది. ఖీూుఖీ నిబంధనల ప్రకారం రక్షణ శాఖ బడ్జెట్‌లో కోత విధించింది. సౌదీ అరేబియా, యూఎఈ, భారత్‌లు తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కావలసిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అంగీకరించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత రాయబారి అక్బరుద్దీన్‌ అంతర్జాతీయ భద్రతామండలి కశ్మీరులో భారత్‌ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిందని చెప్పారు. కశ్మీరులో 370 అధికరణ రద్దు తరువాత భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శాంతిని పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ భద్రతామండలి సావధానంగా విన్నదని ఆయన అన్నారు. ఆగస్టు 6 తరువాత ఎక్కడా హింస తలెత్తలేదని, ఏ పౌరుడు చనిపో లేదని, సంయమనంతో వ్యవహరిస్తూ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

 పాకిస్తాన్‌ మాయాజాలంతో పలువురిలో భారత్‌ పరువు తీయాలని ప్రయత్నించిన అంతర్జాతీయ మీడియాకు కూడా ఇది చెంప పెట్టైంది. అంతర్జాతీయ మీడియాను కూడా ప్రభావితం చేయాలనుకున్న  పాకిస్తాన్‌ ఈ పరిణామంతో ఖంగుతిన్నది.

జమ్మూకశ్మీరులో పరిణామాలు పిఓకె ప్రజల్ని నిద్రలేపాయి. ఇపుడు పిఓకెలో ప్రజలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. భారత్‌తో కలిసిపోతామంటున్నారు. భారత ప్రభుత్వం తదుపరి చర్య ఇక పిఓకెను స్వాధీన పరుచుకోవడమే అనిపిస్తున్నది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ప్రగల్భాలు తప్ప పాక్‌కు ఇక మిగిలిందేమీ  కనపడడం లేదు.  

- హనుమత్‌ ప్రసాద్‌