ప్రముఖుల మాటపర్యావరణ పరిరక్షణ కోసం మహిళలు ప్లాస్టిక్‌ సంచులు వాడవద్దు. వాటికి బదులు బట్ట సంచులు వాడండి. అవి పదేళ్ల పాటు మన్నుతాయి. వీటిని వాడటం ద్వారా మీరు ఎంతో మేలు చేసిన వారవుతారు. ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి భూమిని కాపాడినవారవుతారు.  

- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రిఇస్రో ఉపగ్రహ సాయంతో దేశ వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నదుల్లో ప్రతి ప్రాంతాన్నీ మ్యాప్‌ చేయడం ద్వారా ఇసుక అక్రమ మైనింగ్‌ను అరికట్టవచ్చును. ఉపగ్రహ ఇమేజింగ్‌ పరిజ్ఞానంతో ఇసుకను ఎక్కడ నిల్వ చేస్తున్నారో తెలిసిపోతుంది.

- జావడేకర్‌, కేంద్ర పర్యావరణ మంత్రికైలాస మానస సరోవరం హిందువులకు పుణ్యక్షేత్రం. ఇది అక్సాయ్‌ చిన్‌లో ఉంది. 1962లో చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ దురాక్రమణ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటు న్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని వెంటనే తమకు అప్పగించాలని భారత్‌ చైనాను కోరాలి.

- ఎన్‌.కె. సూద్‌. 'రా' మాజీ అధికారి.