మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం - డా. మోహన్‌ భాగవత్‌


ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాధలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలో, ఎవరు భారత దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి రాజకీయాలలో ఆధ్యాత్మికతను పాదుకొలిపేందుకు మహాత్మా గాంధీ ప్రయత్నించారు.

విశ్వహిందూ పరిషత్‌ బహుముఖ సేవా కార్యక్రమాలు


హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసి సేవ చేయడానికి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి 55 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఒక సంస్థను ఈ రోజు ప్రజలు పూర్తిగా తీవ్రమైన, ముస్లిం వ్యతిరేక, కైస్తవ వ్యతిరేక హింసకు పాల్పడిన వాటిలో ఒకటిగా గుర్తుంచుకోవడం బాధాకరం. దేశంలోని ఎవరూ ప్రవేశించలేని మారుమూల గిరిజన కొండ ప్రాంతాలలో వేలాది సేవా కార్యకలాపాలను నిర్వహిస్తున్నదనే వాస్తవం.

విజయదశమి - దీపావళి


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమి. విజయదశమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఉత్సవం. శ్రీరాముడు రావణునిపై విజయం సాధించిన రోజు. పాండవులు వనవాసం, అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై నుండి దించిన రోజు. జగన్మాత మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్దం చేసి జయంచిన పదవ రోజుగా విజయదశమి పర్వదినం ప్రసిద్ధి.

అన్నిటికీ ప్రభుత్వమేనా! (స్ఫూర్తి)


లాల్‌ బహదూర్‌ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఉత్తరప్రదేశ్‌ వారణాసి దగ్గరలోని సేనాపురికి వెళ్లారు. రైలులో వెళ్ళిన ఆయన స్టేషన్‌ రాగానే కిందికి దిగడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ప్లాట్‌ ఫాం చాలా కిందకు ఉండడంతో అక్కడ దిగడం ఆయనకు చాలా కష్టం అనిపించింది.

భారతదేశం శ్రేష్టజీవనానికి నిలయం (హితవచనం)


ఒక శ్రేష్ఠమైన భావనను విశాల మానవ సమాజంలో వ్యాపింప చేయటమే సభ్యతకు అర్థమైతే ఈ విషయంలో ఆంగ్లేయులు సాధించినదేమీ లేదు.

అమరవాణి


ఆజగామ యధా లక్ష్మీః

నారికేళ ఫలాంబువత్‌ |

నిర్జగామ యధా లక్ష్మీః

గజ భుక్త కపిత్థవత్‌ ||

ప్రముఖుల మాట


స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వాలను కాపాడుకునేందుకు అమెరికా, భారత్‌ కలిసి పనిచేస్తాయి. తమ ప్రజానీకాన్ని ఛాందసవాద ఇస్లామిక్‌ తీవ్ర వాదం నుంచి కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాయి. తమ సరిహద్దులను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యతనిస్తాయి.

- డొనాల్డ్‌ ట్రంప్‌ , అమెరికా అధ్యక్షుడు  (హౌడీ మోదీ కార్యక్రమంలో..)

చిన్నతనంలోనే 'మహాపరీక్ష'లో నెగ్గాడు


ఆధునిక విద్యకే ప్రాధాన్యత, అవకాశం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వేద విద్యను అభ్యసించ డానికి ఎంతో పట్టుదల, విశ్వాసం ఉండాలి. అటువంటి పట్టుదలనే చూపాడు గోవాకు చెందిన ప్రియవ్రత పాటిల్‌. 16 ఏళ్ల చిన్న వయస్సులోనే తెనాలి మహాపరీక్షలో ఉత్తీర్ణుడై ప్రధానమంత్రితో సహా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కనీసం 5,6 సంవత్సరాలు పట్టే ఈ పరీక్షను కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

అంగరంగ 'తెలంగాణా వైభవం'


తెలంగాణా చారిత్రక- సాంస్కృతిక సామాజిక చైతన్యం శతాబ్దాలుగా కొనసాగుతోంది. సాహిత్యం, కధలు, శిల్పం, వృత్తి నైపుణ్యాలతో నిర్మాణమైన వస్తుసంస్కృతి, దేవాలయాలు, పండుగల వైభవానికి ఈ చైతన్యానికి సాక్షులుగా నిలిచి ఉన్నాయి. ఇవాళ లభిస్తున్న శాస్త్ర సాంకేతిక సాహిత్య శాసనాధారా లతో తెలంగాణా వైభవ దీప్తిని లోకార్పణం చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణా వైభవ ఉత్సవం రూపుదిద్దుకుంది. 

ఆర్థికమందగమనం ఎంత తీవ్రమైనది?


ఆర్ధిక మందగమనంపై పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్ధిక నిపుణులు, విధాన కర్తలు పలు రకాల బిన్నాభిప్రాయలు వెలిబుచ్చుతున్న సమయంలో ప్రముఖ ఆర్ధికవేత్తగా పేరుగాంచిన పూర్వ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమనం కేవలం కొద్ది మంది వ్యక్తుల తప్పిదాల కారణంగా సంభవించిందని, నగదు బదిలీ, GST వంటి నిర్ణయాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థలో సమూలంగా ఏర్పడినటు వంటిదని ఆరోపించారు.  

శక్తివంతులం, జ్ఞానవంతులం కావాలి - భాగ్యనగర్‌ గణేశనిమజ్జనోత్సవంలో సర్‌ సంఘచాలక్‌ ఉద్బోధన


గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదు. దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం మంచితనం ఉంటే సరిపోదు. దానితోపాటు శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాకపోయినా ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కొనేందుకు అవసరం. అలాంటి శక్తితోపాటు జ్ఞానం కూడా అవసరమని గణేశుడు మనకు చెపుతున్నాడు. ఈ గణేశ ఉత్సవాల ద్వారా హిందువులంతా ఈ గుణాలను అలవరచుకుని, సంఘటిత శక్తిగా నిలవాల''ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. 

హైదరాబాద్‌లో సేవా సంగమం


సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో నారాయణ గూడలోని కేశవ్‌ మెమోరియల్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగిన సేవా సంగమంలో 250 సేవా సంస్థలు (NGO) పాలుపంచుకున్నాయి. అలాగే ఇందులో జరిగిన వివిధ సమావేశాల్లో 900 మంది మహిళలు, 1100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

భారతీయ మహిళ స్థితిగతులు


భారతదేశంలో మహిళల పరిస్థితి అధ్వా న్నంగా ఉందని, వారికి ఎలాంటి 'హక్కులు' లేవని, 'పురుషాధిక్య సమాజం' వారిని 'వంటింటి కుందేళ్ళు'గా మార్చేసిందని రకరకాల ప్రచారాలు, సిద్ధాంతాలు సాగుతున్నాయి. అయితే మన దేశంలో మహిళల స్థితిగతులు నిజంగా ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు దృష్టి అనే సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది.

రక్తహీనత (ఎనీమియా)


రక్తంలో ఎఱ్ఱరక్తకణాలు తక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి బయటపడుతుంది.

శ్వాస సంబంధించిన సమస్యలు, శరీరపు రంగు పాలిపోయినట్లు తెల్లగా ఉండడం, గోళ్ళరంగు మారడం, అతిత్వరగా అలిసిపోవడం, తరచూ తలతిరుగుతున్న ట్టుండడం మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలు.

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసు కుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

టీటీడీ పుస్తకాల్లో అన్యమత సాహిత్యంతిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రచురించిన పుస్తకాల్లో అన్యమత సాహిత్యం వెలుగు చూడటం వివాదాస్పదమైంది. 'భక్తి గీతామృత లహరి' పేరుతో ధవళేశ్వరానికి చెందిన మెండా చిన సీతారామయ్య రాసిన పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ ఆర్ధిక సాయంతో అచ్చు వేశారు. ఆ పుస్తకం కాపీని టీటీడీ అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచారు. అయితే అందులో హిందూ దేవుళ్ళకు సంబంధించిన పద్యాలతో పాటుగా ఏసు క్రీస్తును స్తుతిస్తూ పద్యాలు ఉండటం వివాదానికి దారితీసింది. లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీటీడి తమ వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకాన్ని తొలగించింది.

కేరళ ప్రభుత్వ కళాశాలల్లో హింసా కేంద్రాలు


కేరళ రాష్ట్రంలో తెరవెనక జరుగుతున్న విద్యార్థి-రాజకీయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేరళలో జస్టిస్‌ పి.కె.షంసుద్దీన్‌ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్‌ ఒక నివేదికను విడుదల చేసింది. తిరువనంతపురంలోని యూని వర్శిటీ కాలేజీల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు తమ విద్యార్థి సంఘ కార్యాల యాలను 'ఇడి మురి' లేదా 'హింసించే గదులు'గా మార్చాయని కమిషన్‌ అభిప్రాయపడింది.