కేరళ ప్రభుత్వ కళాశాలల్లో హింసా కేంద్రాలు


కేరళ రాష్ట్రంలో తెరవెనక జరుగుతున్న విద్యార్థి-రాజకీయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేరళలో జస్టిస్‌ పి.కె.షంసుద్దీన్‌ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్‌ ఒక నివేదికను విడుదల చేసింది. తిరువనంతపురంలోని యూని వర్శిటీ కాలేజీల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు తమ విద్యార్థి సంఘ కార్యాల యాలను 'ఇడి మురి' లేదా 'హింసించే గదులు'గా మార్చాయని కమిషన్‌ అభిప్రాయపడింది. 
కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) అనుబంధ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) భావజాలంతో ఏకీభవించని విద్యార్థు లను ఈ హింసించే గదుల్లోకి తీసుకువెళతారు, అక్కడ వారిని కొట్టడమే కాక, గాయపరుస్తారు. విద్యార్థి సంఘ కార్యాలయాలలో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని కాలేజీలలో మొదటి సంవత్సరం విద్యార్థులు తమ అనుభవాలను కమిషన్‌తో పంచుకున్నారు. సిపిఐ (ఎం)కు సుదీర్ఘ హింసాత్మక చరిత్ర ఉంది. అంతే కాకుండా దాన్ని ఎస్‌ఎఫ్‌ఐపై రుద్దింది. ఇది భారతదేశంలో విద్యార్థి రాజకీయాలను అపహాస్యం చేసింది. చాలా మటుకు ఫిర్యాదులు ఎస్‌ఎఫ్‌ఐపైనే ఉన్నాయి. అంతేకాకుండా, తిరువనంతపురం యూనివర్శిటీ కాలేజీలో బి.ఎస్‌.సి విద్యార్థి ఎస్‌.నిఖిల అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత ఈ కమిషన్‌ ఏర్పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమైన తరువాత కమిషన్‌ ఈ నివేదికను తయారు చేసింది. కేరళలోని క్యాంపస్‌లలో కొనసాగుతున్న చట్టవిరుద్ధ కార్యకలా పాలను అధ్యయనం చేసిన కమిషన్‌ నివేదికను కేరళ గవర్నర్‌కు సమర్పించింది.