అమరవాణి


ఆజగామ యధా లక్ష్మీః

నారికేళ ఫలాంబువత్‌ |

నిర్జగామ యధా లక్ష్మీః

గజ భుక్త కపిత్థవత్‌ ||

భావం : కొబ్బరికాయ లోపల నీరు ఎలా చేరుతుందో అలా సిరిసంపదలు మనకు తెలియకుండానే వస్తాయి. ధనం పోయేటప్పుడు కూడా అంతే. ఏనుగు మింగిన వెలగపండు మాదిరిగా ఖాళీ అయిపోతుంది. కాబట్టి సిరి సంపదలు శాశ్వతం కాదని గ్రహించాలి.