ప్రముఖుల మాట


స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వాలను కాపాడుకునేందుకు అమెరికా, భారత్‌ కలిసి పనిచేస్తాయి. తమ ప్రజానీకాన్ని ఛాందసవాద ఇస్లామిక్‌ తీవ్ర వాదం నుంచి కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాయి. తమ సరిహద్దులను సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యతనిస్తాయి.

- డొనాల్డ్‌ ట్రంప్‌ , అమెరికా అధ్యక్షుడు  (హౌడీ మోదీ కార్యక్రమంలో..)
ఇస్లామిక్‌ దేశాల కంటే భారత్‌లో ముస్లింలు ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ ముస్లింలు ఎవరికి నచ్చిన సంప్రదాయాన్ని వారు అనుసరించవచ్చును. ఇలాంటి స్వేచ్చా, సహనం మరే దేశంలోనూ కనిపించవు.

- మార్క్‌ టుల్లీ, ప్రముఖ పాత్రికేయుడు 
ల్యాండర్‌ విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాం డింగ్‌ విఫలం అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సి నది ఏమి లేదు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఇస్రో తయారు చేసిన థ్రస్టర్లు అద్భుతంగా పనిచేశాయి. అయితే ఎందువల్లనో ల్యాండింగ్‌ అనుకున్న ప్రకారం జరగలేదు. దీనిగురించి ఆందోళన చెంది, గగ్గోలు పెట్టాల్సిన పని లేదు.

- మాధవన్‌ నాయర్‌, ఇస్రో మాజీ ఛైర్మన్‌