విశ్వహిందూ పరిషత్‌ బహుముఖ సేవా కార్యక్రమాలు


హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసి సేవ చేయడానికి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి 55 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఒక సంస్థను ఈ రోజు ప్రజలు పూర్తిగా తీవ్రమైన, ముస్లిం వ్యతిరేక, కైస్తవ వ్యతిరేక హింసకు పాల్పడిన వాటిలో ఒకటిగా గుర్తుంచుకోవడం బాధాకరం. దేశంలోని ఎవరూ ప్రవేశించలేని మారుమూల గిరిజన కొండ ప్రాంతాలలో వేలాది సేవా కార్యకలాపాలను నిర్వహిస్తున్నదనే వాస్తవం.

55 సంవత్సరాల క్రితం 1964 ఆగస్టు 29న అప్పటి 'రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌' సర్‌ సంఘ చాలక్‌ శ్రీ మాధవరావు సదాశివ గోళ్వాల్కర్‌ ప్రోత్సాహంతో 'శ్రీకృష్ణ జన్మాష్టమి' శుభ దినోత్సవం రోజున 'విశ్వ హిందూ పరిషత్‌' (విహెచ్‌పి) స్థాపించ బడింది.

  మొట్టమొదటి హిందూ ప్రపంచ సదస్సు వి.హెచ్‌.పి చొరవతో 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో జరిగింది. అన్ని వర్ణాల, వర్గాల, తెగల హిందూ మత నాయకులను ఒకే వేదికపైకి తెచ్చిన మొదటి విజయవంతమైన ప్రయత్నం అది. సామాజిక కళంకమైన అంటరాని తనంకు వి.హెచ్‌.పి వ్యతిరేకంగా, అవిశ్రాంతంగా పనిచేయడమే కాక దాని సమావేశాలలో ఆ అమానవీయ ఆచారాన్ని ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించి హిందువుల ఉన్నతమైన ఐక్యతను చాటి చెప్పింది.

వి.హెచ్‌.పి అంతర్జాతీయ ఉనికి

వి.హెచ్‌.పి బ్రిటన్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండోనేషియా, బాలితో లాంటి ఇతర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో చురుకుగా ఉంది. విదేశాలలో దీని కార్యకలాపాలు సాధారణంగా హిందూ సమాజం కోసం కార్యక్రమాలను నిర్వహించడం. అమెరికా లోని వి.హెచ్‌.పి.ఎ లేదా వి.హెచ్‌.పి ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మానవ హక్కుల కోసం వాదించింది. 2012 లో ఫిజీ వరద బాధితుల కోసం తుఫాను బాధితులకు స్వచ్ఛంద సంస్థలతో కలసి డబ్బును సేకరించడంతో పాటు మన ఆచారాలు నిర్వహించడానికి పండితులకు శిక్షణ కూడా ఇస్తున్నది.

వి.హెచ్‌.పి బ్రిటన్‌- బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ లలో హిందువులపై జరుగుతున్నమానవ హక్కుల ఉల్లంఘనను ప్రశ్నిచింది. జర్మనీ రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్‌ లో భగవద్గీత, రామాయణ తరగతులను అందిస్తున్నది..

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వేద విద్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో సంస్కృత తరగతులు, వారాంత పాఠశాలలు, సాంస్కృతిక కార్యశాలలు, పండుగలు జరుపుతున్నది.

వి.హెచ్‌.పి మార్చి 2014 లో, తన మొదటి జాతీయ హిందూ మండలిని ఫిజి, న్యూజిలాండ్‌లో జరిపింది. సిడ్నీలో ఒక వేద పాఠశాలను స్థాపించింది, దేవాలయాలు కట్టించింది, మూడు జాతీయ హిందూ సమావేశాలను నిర్వహించింది.

 ఆరోగ్య సంరక్షణ

వి.హెచ్‌.పి-38 ఆసుపత్రులు, 77 డిస్పెన్సరీలు, 653 మొబైల్‌ డిస్పెన్సరీలు, 24 అంబులెన్స్‌ సేవలు, 2000 రోగ నిర్ధారణ కేంద్రాలు, 2600 ఆరోగ్య శిబిరాలు, 775 ఇతర ఆరోగ్య ప్రాజెక్టులతో సహా 6167 ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను నడుపుతున్నది.

వృత్తి విద్యా కార్యక్రమాలు

మొత్తం వి.హెచ్‌.పి 1518 వృత్తి విద్యా కార్యక్రమాలలో 637 మహిళా స్వయం సహాయక బృందాలు, 62 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలు, 181 టైలరింగ్‌ శిక్షణా కేంద్రాలు, 371 కుటీర పరిశ్రమ శిక్షణా కేంద్రాలు, 232 జంతు పెంపకం ప్రాజెక్టులతో పాటు 35 ఇతర స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.


విద్యా కార్యక్రమాలు

వి.హెచ్‌.పి విద్య అందించడం లాంటి కార్యక్ర మాలలో, దాని ముద్ర వేయడంలో విజయవంత మైంది. ఈ సంస్థ 634 బాల్వాడిలు, 639 బాల సంస్కార కేంద్రాలు, 490 ప్రాథమిక పాఠశాలలు, 62 మధ్య పాఠశాలలు, 31 ఉన్నత మధ్య పాఠశాలలు, 52954 గ్రామ శిక్షా మందిరాలు, 158 వసతి గృహాలు, 188ఇతర విద్యా ప్రాజెక్టులు, 57 కోచింగ్‌ కేంద్రాలు, 88 గ్రంథాల యాలు, 12 సంస్కృత వేద విద్యాలయా లతో సహా 55313 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

శిశు సంక్షేమం, బాల సంస్కార పాఠశాలలు, అనాథాశ్రమాలు, మహిళా సాధికారత, జీవనోపాధి కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, అత్యవసర వైద్య సహాయం, సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాల ఉపశమనం, ధర్మ ప్రచార, సమాజిక సమరసత కార్యక్రమాల ద్వారా పైన పేర్కొన్న లక్ష్యాలను అందుకోవడం.

కానీ ఈ కార్యక్రమాలు ఎక్కడా గుర్తించబడవు, ప్రస్తావించ బడవు. 'ఏకల్‌ విద్యాలయ' లేదా సింగిల్‌ టీచర్‌ స్కూల్స్‌ను దేశంలోని మారుమూల, ఎవరూ చేరలేని ప్రాంతాల్లో నడిపించడంలో చాలా ప్రశంస నీయమైన పని చేస్తున్నదని చాలా కొద్ది మందికి తెలుసు. డిస్పెన్సరీలు, వైద్యులు, ఆసుపత్రులు లేని ప్రజలకు వైద్య, ఆరోగ్య కార్యకలాపాల ద్వారా వి.హెచ్‌.పి మెరుగైన చికిత్స అందించడం గురించి చాలామందికి తెలియదు. సామాజిక సేవా రంగంలో వి.హెచ్‌.పి కార్యక్ర మాలు చాలా రెట్లు ఆకట్టుకునేవి. వారు వైద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో వృత్తి విద్యా శిక్షణ, విద్య, సాంఘిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మతపరమైన తీర్థయాత్రలు, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అత్యవసర సహాయం అందిస్తారు.