రక్తహీనత (ఎనీమియా)


రక్తంలో ఎఱ్ఱరక్తకణాలు తక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి బయటపడుతుంది.

శ్వాస సంబంధించిన సమస్యలు, శరీరపు రంగు పాలిపోయినట్లు తెల్లగా ఉండడం, గోళ్ళరంగు మారడం, అతిత్వరగా అలిసిపోవడం, తరచూ తలతిరుగుతున్న ట్టుండడం మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలు.

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసు కుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

కారణం

- పౌష్టికాహారం తగు మోతాదులలో తీసుకోక పోవడం.

- దెబ్బలు తగిలి అధికంగా రక్తం పోవడం.

- రజస్వల సమయంలో ఎక్కువగా రక్తస్రావం.

- పైల్స్‌ సమస్య.

- పొట్టలో పురుగులు.

నివారణ

ఇనుము అధికంగా ఉండే టటువంటి పదార్థములు ఎక్కువగా తీసుకోవాలి. ఉదా|| పప్పు దినుసులు, చేప, కోడిగుడ్లు, మాంసం, పాలు, పెరుగు, ఆకుకూరలు, బీట్రూట్‌, నిమ్మకాయలు, బత్తాయి పళ్ళు, ఉసిరికాయ, యాపిల్‌..

ఉల్లి, మెంతులు, అధికంగా తీసుకోవాలి.

బూడిద గుమ్మడికాయ రసం,

ఉసిరికాయ రసం తీసుకోవాలి.