కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్ముకశ్మీర్‌, లడఖ్


370వ అధికరణం సవరించడంతో ప్రత్యేక హోదా రద్దయిన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించింది. అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకశ్మీర్‌, లడఖ్ లు రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల పర్యవేక్షణలో ఉండే ఈ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన బాధ్యతలు పూర్తిగా కేంద్రం చేపట్టింది.

తమిళనాడులో 150 ఏళ్ళుగా జరుగుతున్న అన్నదానం


తమిళనాడులోని వడలూర్‌లో గత 150 ఏళ్ళుగా ఆన్నదాన కార్యక్రమం నిరాటంగా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఆకలిగొన్నవారికి రోజుకు మూడుసార్లు భోజనం పెడతారు. విదేశీలు తమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, వల్లలార్‌గా ప్రసిద్ది చెందిన శైవ సాధువు స్వామిరామలింగ అరుల్‌ ప్రకాస తమిళనాడులో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది పలికారు. బెంగాల్‌లోని రామకష్ణ పరమహంస, గుజరాత్‌లోని దయానంద సరస్వతి, తమిళనాడులో వల్లలార్‌ (1823-1874) వంటి ఆధ్యాత్మిక వేత్తల మూలంగా ఆధ్యాత్మికతకు కొత్తనిర్వచనం ఏర్పడింది.

ధన్వంతరి జయంతి


భాగవతం అష్టమ స్కందంలో ''క్షీర సాగర మధనం'' సమయములో ''ధన్వంతరి'' ఆవిర్భావం జరిగిందని వర్ణించబడింది. ముందుగా హలాహలం ఉద్భవించింది. దానిని పరమ శివుడు తన కంఠంలో దాచాడు. వరుసగా కామదేనువు, ఐరావతం, పారిజాతం, ఆవిర్భవించాయి. తరువాత లక్ష్మీదేవి అవత రించింది. చివరిగా ధన్వంతరి అవతరించాడు. 

విశ్వాసం (స్ఫూర్తి)


మొక్కల్లో కూడా ప్రాణ ముందని, వాటికి కూడా మనలాగానే బాధ, ఆనందం ఉన్నాయని జగదీశ్‌ చంద్రబోస్‌ నిరూపించారు. కానీ భారతీయుడైన జగదీష్‌ చంద్రబోస్‌ చెప్పిన విషయాన్ని అంగీకరించని పాశ్చాత్యులు ఆయన సిద్ధాంతాన్ని ఎగతాళి చెశారు. లండన్‌ రాయల్‌ సొసైటీలో తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి జగదీశ్‌ చంద్రబోస్‌ సిద్ధపడ్డప్పుడు కొందరు పాశ్చాత్యులు కుట్ర చేశారు. 

సమంగా స్వీకరించండి (హితవచనం)


సజ్జనులారా అహంకారం వీడండి. స్వార్థం విడిచి పెట్టండి. చెడు సహవాసాలకు దూరంగా ఉండండి. దుఃఖం, సంతోషం, గౌరవం మరియు అవమానాన్ని సమంగా స్వీకరించండి. ఇది కష్టతరమే అయినప్పటికీ సాధకుడికి అసాధ్యం కాదు.

అమరవాణి


నిష్ణాతోపిచ శాస్త్రార్థే

సాధుత్వమ్‌ నైతి దుర్మతిః |

ఆకల్పమ్‌ జలమగ్నాపి

మార్దవం నైతి వై శిలా ||

ప్రముఖుల మాట


అయోధ్య రామమందిర విషయమై సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఎలా ఉన్నా అందరూ దానిని అంగీక రించాలి. దేశంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.

 - అయోధ్య తీర్పు నేపధ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటన

బీహార్‌ వరద బాధితులను ఆదుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌


గత నెల బీహర్‌లో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవకులు సేవా, సహాయక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. వరద తాకిడి ప్రాంతాల్లో వందలాది మంది స్వయంసేవకులు నిర్విరామంగా వరదభాదితులకు సేవ చేశారు. వందలాది కుటుంబాలను వరద తాకిడి నుండి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూత్‌నాథ్‌ రోడ్‌, మున్నాచౌక్‌, డాక్టర్స్‌ గోలంబార్‌, వైశాలి గోలంబార్‌ ప్రాంతా లలో వరద భాదితుల కోసం తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

స్వాభిమానం, స్వావలంబనతోనే దేశప్రగతి సాధ్యంఆర్‌ఎస్‌ఎస్‌ విజయదశమి ఉత్సవంలో పరమపూజనీయ సర్‌ సంఘచాలక్‌ డా. శ్రీ మోహన్‌ జీ భాగవత్‌ ఉపన్యాస సారాంశం

ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ, దేశ హితం కోసం వాటిని పూర్తిచేయాలనే ధోరణి, సాహసం రెండోసారి ఎన్నికైన ప్రభుత్వంలో ఉన్నదనే విషయం అధికరణం 370 సవరణతో స్పష్టమైంది. ఇతర పార్టీల మద్దతు కూడ గట్టుకుని, రెండు సభల్లోనూ మూడింట రెండు వంతుల ఆమోదంతో, సామాన్య ప్రజానీకపు ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 

ఇదీ అయోధ్య చరిత్ర!


అయోధ్యా రామమందిర విషయంలో దేశపు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న (ఈ పత్రిక ప్రచురించినప్పటికి ఇంకా తీర్పు రాలేదు) సమయంలో సుదీర్ఘమైన రామమందిర ఉద్యమం, పోరాటంలో ముఖ్య అంశాలను చూద్దాం.

దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 20 పెద్ద ఆసుపత్రులు, 15 బ్లడ్‌ బ్యాంక్‌లు కూడా నడుస్తున్నాయి.

భూసారానికి పంచగవ్య


భూసారాన్ని బట్టి పంట దిగుబడి, పంట నాణ్యత ఆధారపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. భూసారాన్ని కాపాడుకోవడం కూడా వ్యవసాయంలో చాలా ముఖ్యమైన అంశం. భూసారాన్ని దెబ్బతీయని విధంగా, దానిని మరింత పెంపొందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక లాభాల కోసం ఈ సారాన్ని దెబ్బతీసే పంటల్ని వేయడంవల్ల తాత్కాలిక ప్రయోజనం కలిగినా దీర్ఘకాలంలో నష్టం తప్పదు. భూసారాన్ని కాపాడుకునేందుకు, పెంపొందించేందుకు అనేక సంప్రదాయ పద్ధతుల్ని భారతీయులు ఉపయోగించారు. 

కార్తీక వైభవం


మన తెలుగు మాసాల్లో ప్రతి మాసానికి ఒక్కో విశేషత ఉంది. అయితే అన్నీ మాసాల్లోనూ కార్తీక మాసానిది ఓ విశిష్టశైలి. దీన్ని హరిహరులిద్దరికీ ప్రీతికరమైన మాసమని అంటారు. స్థితికారకుడు హరి, హరుడు శివుడు వీరిద్దరి ఆరాధన పద్థతి మనకు శుభాలిచ్చేదిగా ఉండాలని దానికి ప్రతీకగా కార్తీకమాసాన్ని చెబుతుంటారు. కార్తిక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.

మొక్కలు ఔషధగుణాలు


మనకి చుట్టుపక్కల లభ్యం అయ్యే కొన్ని మొక్కల వాసనను చూడటం వలన ఏయే వ్యాధులు నయం అవుతాయో చూద్దాం.

పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి


వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన 11 మసీదులను హిందువులకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్‌, షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ వసీమ్‌ రజ్వి అన్నారు. ముస్లింలు మధుర, వారణాసి, జౌన్‌పూర్‌లతోసహా దేశ వ్యాప్తంగా ఇలాంటి 11 వివాదాస్పద స్థలాల విషయంలో తమ వాదనను ఆపివేసి, తమ పూర్వీ కుల తప్పులను సరిదిద్దుకోవడానికి ఆ స్థలాలను హిందువులకు అప్పగించాలని రిజ్వి విజ్ఞప్తి చేశారు. 

కథువా కేసు: బయటకొస్తున్న నిజాలు


దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్‌) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయా ల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది. 

విద్యార్థులచే మత ప్రార్థనలు పాడిస్తున్న ప్రధానోపాధ్యాయుడు


బిసాల్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్‌ అలీ(45), 1902లో ముహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన ''లబ్‌ పె ఆతి హై దువా'' అనే మతపరమైన కవితను విద్యార్థులచే పాడించినందుకు ప్రభుత్వం అతడిని విధుల నుంచి తొలగించింది. బిసాల్‌పూర్‌, బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (బీఈఓ) ఉపేంద్ర కుమార్‌ జరిపిన విచారణలో ఈ విషయం నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.