తమిళనాడులో 150 ఏళ్ళుగా జరుగుతున్న అన్నదానం


తమిళనాడులోని వడలూర్‌లో గత 150 ఏళ్ళుగా ఆన్నదాన కార్యక్రమం నిరాటంగా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఆకలిగొన్నవారికి రోజుకు మూడుసార్లు భోజనం పెడతారు. విదేశీలు తమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, వల్లలార్‌గా ప్రసిద్ది చెందిన శైవ సాధువు స్వామిరామలింగ అరుల్‌ ప్రకాస తమిళనాడులో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది పలికారు. బెంగాల్‌లోని రామకష్ణ పరమహంస, గుజరాత్‌లోని దయానంద సరస్వతి, తమిళనాడులో వల్లలార్‌ (1823-1874) వంటి ఆధ్యాత్మిక వేత్తల మూలంగా ఆధ్యాత్మికతకు కొత్తనిర్వచనం ఏర్పడింది.

సంపూర్ణ శాఖాహారం ప్రోత్సహిస్తూమానవులందరూ, అలాగే సర్వ జీవరాసుల్లోని అంతః చేతనను ఆరాధించాలని చెప్పిన వల్లలార్‌, సష్టి అంతా ఒకటేనని బోధించారు. వల్లలార్‌ చూపిన సంసార శుద్ధ సన్మార్గం అత్యున్నత అధ్యాత్మిక మార్గం. మరణాభయాన్ని జయించడ మెలాగో చూపిన ఈ మార్గాన్ని అన్నీ రకాలవారు అనుసరించారు. ఆయన బోధనలు జీవులపై అన్ని రకాల హింసను, క్రూరత్వాన్ని నిరోధించడమేకాక సంపూర్ణ శాఖాహారమే ఆధ్యాత్మిక సాధనకు మంచి సాధనంగా చెప్పాయి.

అన్ని మతాలలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కన్నా మంచి పూజలు, ఆచారాలు లేవు. అన్నదానం మహాదానం. అంతేకాక ఇది సనాతన ధర్మ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. హిందూ గ్రంథాలలో అన్నదానం గొప్పదనాన్ని చెప్పే అనేక కథలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా పార్వతి దేవి అన్నపూర్నేశ్వరి దేవిగా కనిపించడం, శివుడికి ఆహారం ఇవ్వడం లాంటివి.

ఆరాధనకు అత్యున్నత రూపం

సామాన్య ప్రజానీకానికి అందని ఆధ్యాత్మికత ఎందుకని స్వామి రామలింగ వల్లలార్‌ ప్రశ్నించారు. ఎవరైనా ఆకలితో ఉంటే ఆయన భరించలేక పోయేవారు. తోటి మానవుడని ఆకలిని తీర్చకపోతే దయ, ప్రేమ అర్థం ఏమిటి? అంతేకాదు, ఆహారం శరీరానికి ప్రాథమిక అవసరమైతే శరీరం ఆత్మ నివాసస్థానం. శరీరాన్నిజాగ్రత్తగా చూసుకోకుండా ఎవరైనా శరీరంలో నివసించే ఆత్మను ఎలా చూసుకుంటారు? స్వామీజీ ప్రకారం అధ్యాత్మికతకు మూలం ఆకలిని తీర్చడమే. ఆకలిని తీర్చడమంటే భగవంతుని నిలయమైన ఈ దేహాన్ని కాపాడడమే. తోటి మానవుల ఆకలిని తీర్చడానికి స్వామి రామలింగ అడిగళ్‌ మే, 23, 1867న ఈ ఆన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ అన్నదాన కార్యక్రమం రోజుకు మూడుసార్లు పేదలకు ఆహారం అందిస్తున్నది. పొయ్యి 21 అడుగుల పొడవు, 2.5 అడుగుల లోతు ఉంటుంది. వల్లలార్‌లోని సత్యధర్మశాలలో వెలిగించిన పొయ్యి విరామం లేకుండా, చల్లార కుండా ఈ రోజు వరకు మండుతున్నది. రాత్రులలో వంట చేయనప్పటికీ, వల్లలార్‌ పట్ల గౌరవ చిహ్నంగా,వల్లలార్‌ ప్రారంభించిన మంటను ఈ రోజు వరకు ఆర్పలేదు, పొయ్యి ఇంకా సజీవంగా ఉంది. ఆరాధనకు అత్యున్నత రూపంగా పేదలకు ఆహారం పంచమన్న వల్లలార్సూచన మేరకు ఒకటిన్నర శతాబ్దానికి పైగా పేదలకు ఈ ఉచిత ఆహారం నేటికీ అందుతోంది.

నీటి కొరతను నివారించడానికి కరుంగుహి-మీతుకుప్పం మార్గంలో తవ్వించిన తీన్చువాయి కాలువ ఇప్పటికీ ప్రజల దాహాన్ని తీరుస్తున్నది. వల్లలార్‌ తమిళం, సంస్కతం, ఇంగ్లీష్‌ భాషలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుత మఠం అధిపతి శ్రీ ఓరన్‌ అడిగల్‌. వల్లలార్‌ ప్రారంభించిన పాఠశాలలో ఈ త్రిభాషా సూత్రాన్ని అభ్యసించారు. వల్లలార్‌ తిరుకురల్‌ క్లాసులతో పాటు పెద్దవాళ్ళకు విద్యను కూడా ప్రారంభించాడు.

జంతువులు, మొక్కలతో సహా అన్ని జీవులను ప్రేమించాలని వల్లలార్‌ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రభుత్వం 2003 ఆగస్టులో అన్ని దేవాలయాలలో జంతు బలినినిషేధించే చట్టాన్ని రూపొందించడం ద్వారా వల్లలార్‌ సిద్ధాంతాన్ని అమలు చేసింది.

ముగింపు : 1972 సంవత్సరంలో, ఆనాటి ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారతీయ అధికారి మాననీయ మాధవరావు ములే ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పటి ఆర్‌.ఎస్‌.ఎస్‌ జిల్లాప్రచారక్‌ శ్రీ షణ్ముగనాథన్‌ ఆయన్ని సత్య జ్ఞాన సబాయి (సత్య జ్ఞానం మందిరం), ధర్మ సబాయి, సిద్ధి వలగం వద్దకు తీసుకువెళ్లారు. సోదరభావం వంటి సంస్కారాలను ఇవ్వడానికి ఆశ్రమానికి మంచి వాతావరణం ఉందని,మఠం కార్యదర్శితో జరిపిన సుదీర్ఘ చర్చలో వారికి ప్రత్యేకంగా చెప్పారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆర్‌ఎస్‌ఎస్‌ తన వార్షిక శిక్షణా శిబిరం ఓటిసిని అక్కడ నిర్వహించింది.పూర్వ ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఘచాలక్‌ శ్రీ రజ్జుభయ్యా కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించారు.