విద్యార్థులచే మత ప్రార్థనలు పాడిస్తున్న ప్రధానోపాధ్యాయుడు


బిసాల్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్‌ అలీ(45), 1902లో ముహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన ''లబ్‌ పె ఆతి హై దువా'' అనే మతపరమైన కవితను విద్యార్థులచే పాడించినందుకు ప్రభుత్వం అతడిని విధుల నుంచి తొలగించింది. బిసాల్‌పూర్‌, బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (బీఈఓ) ఉపేంద్ర కుమార్‌ జరిపిన విచారణలో ఈ విషయం నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో మదర్సాల్లో పఠించే మత ప్రార్థనను పాఠశాల విద్యార్థులచే పఠింప చేశాడని స్థానిక వీహెచ్‌పీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పిలిభిత్‌ జిల్లా పరిపాలన యంత్రాంగం బిసాల్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విధుల నుండి బహిష్క రించింది.

పిలిభిత్‌ డి.ఎం వైభవ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ - ప్రధానోపాధ్యాయుడు జాతీయ గీతం పాడించకుండా విద్యార్థులచే మత ప్రార్థన పాడిస్తున్నందున విధుల నుండి బహిష్కరించామని అన్నారు.