విశ్వాసం (స్ఫూర్తి)


మొక్కల్లో కూడా ప్రాణ ముందని, వాటికి కూడా మనలాగానే బాధ, ఆనందం ఉన్నాయని జగదీశ్‌ చంద్రబోస్‌ నిరూపించారు. కానీ భారతీయుడైన జగదీష్‌ చంద్రబోస్‌ చెప్పిన విషయాన్ని అంగీకరించని పాశ్చాత్యులు ఆయన సిద్ధాంతాన్ని ఎగతాళి చెశారు. లండన్‌ రాయల్‌ సొసైటీలో తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి జగదీశ్‌ చంద్రబోస్‌ సిద్ధపడ్డప్పుడు కొందరు పాశ్చాత్యులు కుట్ర చేశారు. 
మనుషులకు హానిచేసే విషం మొక్కలకు కూడా నష్టం కలిగిస్తుందని, అవి కూడా బాధను అనుభవిస్తాయని చెపుతూ అక్కడే ఉన్న విషపు ద్రవాన్ని మొక్కకు ఎక్కించారు. అయినా ఆ మొక్కకు ఏమీకాలేదు. అలా రెండుసార్లు చేసినా మొక్క మాత్రం మామూలుగానే ఉండడంతో అక్కడున్న పాశ్చాత్యులు బోస్‌ను ఎగతాళిచేయడం ప్రారంభిం చారు. దానితో 'మొక్కలకు హాని చేయని ద్రవం మనుషులకూ నష్టం చేయ కూడదుకదా' అంటూ బోస్‌ ఆ ద్రవాన్ని తాగేశారు. అంతా నిర్ఘాంతపోయారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రయోగశాల ఉద్యోగి 'మీకు ఇచ్చినది విషద్రవంకాదు చక్కెర నీళ్లు' అని నిజం చెప్పాడు. మొక్కల్లో ప్రాణం ఉందనే తన సిద్ధాం తాన్ని బోస్‌ అలా కూడా నిరూపించారు. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ప్రపంచం ముందుకు తెచ్చినందుకు బోస్‌ను సర్వశ్రేష్ట శాస్త్రవేత్తగా ప్రకటించాలని ఐన్‌స్టీన్‌ ప్రశంసించాడు కూడా.