మొక్కలు ఔషధగుణాలు


మనకి చుట్టుపక్కల లభ్యం అయ్యే కొన్ని మొక్కల వాసనను చూడటం వలన ఏయే వ్యాధులు నయం అవుతాయో చూద్దాం.

చేమంతి : ఈ చెట్టు జాతిలో అడివి చేమంతి అనే మరొక రకం కూడా కలదు. ఈ చెట్టు పూలతో అరకు తయారు చేసిన అరకు మూర్చ, శ్వాస, తాపము మరియు అరుచిని పోగొట్టును. దీని పువ్వులు, ఆకులలో చామాజులెన్‌, కుమారిక్‌, కాంఫర్‌, బోర్నియోల్‌, టర్పెనిస్‌ మున్నగు చేదు తైలాలు కలవు. వాటికి అలర్జీని అరికట్టు గుణములు ఉన్నవి. కావున జేబు రుమాలుకు దీని అత్తరును అంటించి వాసన చూసిన యెడల అలర్జీ గల వారికి రక్షణ కవచముగా ఉండును.

తులసి :
దీని దళములన, పుష్పములను గుచ్చముగా కట్టి వాసన పీల్చుకుంటే తలభారం, తలనొప్పి, పడిసెము, రొమ్ము నందు జలుబు, గొంతునొప్పి, తలతిరుగుడు, పైత్యవికారం, ముక్కునందు క్రిములు నశించును.

 నీలగిరి : దీని ఆకులను, పువ్వులను నలిపి వాసన చూసినచో వగర్పు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, చెవులదిబ్బడ, దంతశూల, పడిసెము, ముక్కు వెంట ఆగకుండా నీరు కారుట (పీనస రోగం) తగ్గిస్తుంది.

కుంకుమపువ్వు :
  నాలుగైదు చుక్కలు గులాబీ అరకులో రెండు మూడు రేకుల స్వచ్చమైన కుంకుమ పువ్వును అరచేతిలో తీసుకుని బాగుగా రుద్ది వాసన చూచుచుండిన యెడల తీవ్రమైన తలనొప్పులు, కంటిమంట , ముక్కు నుంచి వెలువడు దుర్గన్ధము, చిత్తచాంచల్యము , జలుబు దోషము , మూర్చవ్యాధి పోవును.