దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 20 పెద్ద ఆసుపత్రులు, 15 బ్లడ్‌ బ్యాంక్‌లు కూడా నడుస్తున్నాయి.

భువనేశ్వర్‌లో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల ముగింపు తరువాత సర్‌ కార్యవహ శ్రీ భయ్యాజీ జోషి పత్రిక విలేకరులతో మాట్లాడారు. ప్రకతి విపత్తులు సంభవించినప్పుడు స్వయంసేవకులు సహాయ కార్యక్రమాలు చేపట్టేవారని, కానీ 1989 నుంచి సంఘ ద్వారా ప్రణాళికాబద్ధంగా సేవాకార్యక్ర మాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలియ జేశారు.

అలాగే స్వయంసేవకులు అవసరమైనవారికి ప్రత్యేకమైన సేవలు కూడా అందజేస్తున్నారని భయ్యాజీ తెలిపారు. స్వయంసేవకుల కషి మూలంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం 3 నుంచి 4 వేల నేత్ర దానాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణాభివద్ది రంగంలో కూడా స్వయంసేవకులు పనిచేస్తున్నారు. స్థానికుల సహాయ సహకారాలతో 250 గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దరని ఆయన తెలియజేశారు. గ్రామాలకు సంబంధించిన సమస్యలను గ్రామీణులే పరిష్కరించుకోవాలని, అందుకు అవసరమైన సహాయాన్ని మాత్రం అందించాలన్నది స్వయంసేవకులు అనుసరిస్తున్న సూత్రమని ఆయన అన్నారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన రంగాల్లో స్వయంసేవకులు పనిచేస్తున్నారు.

సంఘ ఆలోచన, దృక్పధాన్ని అంగీకరించి లక్షకు పైగా గ్రామాలకు చెందిన వారు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని భయ్యాజీ అన్నారు.

నిత్య శాఖలకు హాజరయ్యే 16-17 సంవత్స రాల వయస్సు కలిగినవారు 5లక్షల మంది ఉంటారని, అలాగే మరో 4లక్షల మంది 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగినవారని వివరించారు. మొత్తం 59వేల గ్రామీణ మండ లాలకుగాను 30వేల మండలాలలో సంఘ కార్యం జరుగుతోందని చెప్పారు.

 ప్రస్తుతం 57,411 రోజువారీ శాఖలు, 18,923 'వారంతపు శాఖలు' (సాప్తాహిక్‌ మిలన్‌) జరుగుతున్నాయి. 2009 లో విస్తరణ కార్యక్రమం చేపట్టారు. 2010 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు 19,584 పెరిగాయి. 2010 నుండి 2014 వరకు సుమారు 6000 శాఖలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వయం సేవకులు దేశంలోని 6000 బ్లాక్‌లలో నిర్వహిస్తున్నారు, ఇవి మొత్తం బ్లాక్‌లలో 90 శాతం.