అమరవాణి


నిష్ణాతోపిచ శాస్త్రార్థే

సాధుత్వమ్‌ నైతి దుర్మతిః |

ఆకల్పమ్‌ జలమగ్నాపి

మార్దవం నైతి వై శిలా ||

భావం : శాస్త్రార్థంలో సమర్ధుడైనప్పటికిన్నీ దుష్టుడు మంచితనాన్ని పొందలేడు. యుగములతరబడి నీటిలో మునిగి ఉన్నాకూడా బండఱాయి మెత్తగా కాజాలదు కదా. దుష్టుడు మనతో ఎన్నినాళ్ళు కలసి ఉన్నా వాడు మంచివాడు అవుతాడని, అయిపోయాడని మనము అనుకోరాదు.